News July 17, 2024

ర్యాంకింగ్స్‌లో దూసుకొచ్చిన జైస్వాల్

image

ఐసీసీ విడుదల చేసిన టీ20 ర్యాంకింగ్స్‌లో టీమ్ ఇండియా యంగ్ ప్లేయర్ యశస్వీ జైస్వాల్ దూసుకొచ్చారు. 4 స్థానాలు మెరుగుపరుచుకుని 743 పాయింట్లతో ఆరో స్థానానికి చేరుకున్నారు. ట్రావిస్ హెడ్ అగ్ర స్థానంలో కొనసాగుతున్నారు. టాప్-5లో సూర్య, ఫిల్ సాల్ట్, బాబర్ ఆజమ్, మహ్మద్ రిజ్వాన్ ఉన్నారు. రుతురాజ్ గైక్వాడ్ ఎనిమిదో ప్లేస్‌కు చేరారు. టీ20 బౌలర్ల ర్యాంకింగ్స్‌లో అన్రిచ్ నోర్జే టాప్‌లో ఉన్నారు.

Similar News

News September 13, 2025

IOBలో 127 పోస్టులకు నోటిఫికేషన్

image

ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్‌(IOB)లో 127 స్పెషలిస్టు ఆఫీసర్స్ ఉద్యోగాలకు ప్రకటన వెలువడింది. అభ్యర్థులు అక్టోబర్ 3 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో డిగ్రీ/బీఆర్క్‌/బీటెక్‌/బీఈ/ ఎంఎస్సీ/ఎంఈ/ఎంటెక్‌/ఎంబీఏ/పీజీడీఎం/పీజీడీబీఏలో ఉత్తీర్ణత సాధించాలి. 01-09-2025 నాటికి 25-40 ఏళ్లు ఉన్నవారు అర్హులు. ఆన్‌లైన్ ఎగ్జామ్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
వెబ్‌సైట్: <>https://www.iob.in/<<>>

News September 13, 2025

వర్షాలు.. కోళ్ల పెంపకందారులకు సూచనలు

image

ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో కోళ్లకు వ్యాధులు సోకే అవకాశం ఎక్కువ. అందుకే కోళ్ల ఫారాన్ని శుభ్రంగా ఉంచాలి. ఫారం నుంచి నీరు బయటకు పోయేలా డ్రైనేజ్ సక్రమంగా ఉండేట్లు చూసుకోవాలి. కోళ్లకు నీరందించే నీటి బుట్టలు లీక్ కాకుండా సరి చూడాలి. లిట్టర్ బాగా తడిగా ఉంటే దాన్ని వెంటనే తొలగించాలి. ఫారంలోకి గాలి, వెలుతురు బాగా వచ్చేలా చూసుకోవాలి. కోళ్లలో అనారోగ్య లక్షణాలు కనిపిస్తే వెటర్నరీ డాక్టరును సంప్రదించాలి.

News September 13, 2025

కోళ్ల ఫారాల్లో ‘లిట్టర్’ నిర్వహణ ముఖ్యం

image

లిట్టర్ అనేది కోళ్ల ఫారాలలో నేలపై గడ్డి, చెక్క పొట్టు, లేదా ఇతర సేంద్రియ పదార్థాల రూపంలో ఉంటుంది. దీన్ని కోళ్ల ఫారాలలో పరుపుగా ఉపయోగిస్తారు. ఇది కేవలం కోళ్ల పడక పదార్థమే కాదు. కోళ్ల మల విసర్జనలోని తేమను పీల్చి పొడిగా ఉంచుతుంది. ఫారాల్లో దుర్వాసనను తగ్గిస్తుంది. కోళ్లకు సౌకర్యంగా ఉండేట్లు చేసి.. వ్యాధికారక క్రిములు పెరగకుండా చేస్తుంది. లిట్టర్ నిర్వహణ సరిగాలేకుంటే వ్యాధుల ఉద్ధృతి పెరుగుతుంది.