News July 17, 2024
‘గబ్బర్‌సింగ్’ రీరిలీజ్ డేట్ ఫిక్స్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ‘గబ్బర్‌సింగ్’ మూవీ రీరిలీజ్ కానుంది. పవన్ బర్త్ డే సందర్భంగా సెప్టెంబర్ 2న ఈ చిత్రాన్ని రీరిలీజ్ చేయాలని మేకర్స్ నిర్ణయించారు. హరీశ్ శంకర్ తెరకెక్కించిన ఈ మూవీలో శ్రుతిహాసన్ హీరోయిన్‌గా నటించారు. దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ అందించారు. బండ్ల గణేశ్ నిర్మాతగా వ్యవహరించారు. ఈ మూవీ 2012 మే 11న విడుదలై సక్సెస్ సొంతం చేసుకుంది.
Similar News
News April 4, 2026
పాక్‌పై భారత్ మరోసారి దాడి చేస్తుందా?

పశ్చిమాసియా యుద్ధంతో పాక్‌లో ఆర్థిక సంక్షోభం తీవ్రస్థాయికి చేరింది. దీన్నే అవకాశంగా మలుచుకొని దాయాదిని దెబ్బకొట్టాలని IND భావిస్తోందా? ఉగ్రవాదాన్ని పోషిస్తూ కంట్లో నలుసులా మారిన PAKను OpS-2తో నాశనం చేయడానికి సిద్ధమవుతోందా? త్రివిధ దళాధిపతులతో రాజ్‌నాథ్ భేటీలు, పాక్‌కు <<19547918>>వార్నింగ్<<>>, రాష్ట్రాల్లో మాక్ డ్రిల్, ప్రజలకు 3 నెలల రేషన్(యుద్ధం వస్తే ఇబ్బంది పడకుండా) సరఫరా ఈ ప్రశ్నలకు బలం చేకూరుస్తున్నాయి.
News April 4, 2026
BRS ఖాతాలో మరో రెండు మున్సిపాలిటీలు

TG: గతంలో వాయిదా పడ్డ ఇబ్రహీంపట్నం, క్యాతనపల్లి మున్సిపాలిటీ ఛైర్మన్ పీఠాలను BRS కైవసం చేసుకుంది. నాటకీయ పరిణామాల మధ్య తాజాగా జరిగిన ఎన్నికలో రెండు మున్సిపాలిటీలను ఖాతాలో వేసుకుంది. క్యాతనపల్లి ఛైర్మన్‌గా గొడిశెల సంధ్యారాణి, ఇబ్రహీంపట్నం ఛైర్మన్‌గా సుదర్శన్ రెడ్డి ఎన్నికయ్యారు.
News April 4, 2026
బరువు ఎప్పుడూ ఒకేలా ఉండాలంటే..

ఎత్తుకు తగ్గ బరువును మెయింటైన్ చేస్తూ, శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడం ప్రతి ఒక్కరికీ అవసరం. కొన్ని అలవాట్లను పాటిస్తే బరువు పెరగకుండా జాగ్రత్తపడొచ్చంటున్నారు నిపుణులు. రాత్రి 8 తర్వాత ఆహారం తీసుకోకూడదు. ఆలస్యంగా, ఎక్కువ మోతాదులో తినడంతో జీవక్రియలకు అంతరాయం కలుగుతుంది. ప్రాసెస్డ్ ఫుడ్, నూడిల్స్, వేపుళ్లకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. శరీరానికి తగినంత నీరు అందేలా చూసుకోవాలి.


