News July 17, 2024
ఎచ్చెర్ల మండల వాసికి నేషనల్ గ్లోబల్ ఐకాన్ అవార్డు

ఎచ్చెర్ల మండలం కేశవరావుపేట ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడు డాక్టర్ పారుపల్లి శ్రీనివాసరావు(పీఎస్ఆర్) విద్యా, సామాజిక రంగాల్లో అందిస్తున్న సేవలకు గుర్తింపుగా నేషనల్ గ్లోబల్ ఐకాన్ అవార్డు లభించింది. ఈ మేరకు బుధవారం వర్చువల్ విధానంలో ఆయనకు సర్టిఫికెట్ అందించారు.
Similar News
News November 1, 2025
ఘనంగా అరసవల్లి ఆదిత్యుని కళ్యాణం

అరసవల్లి సూర్యనారాయణ స్వామి దేవాలయంలో శనివారం స్వామివారి కళ్యాణం జరిగింది. కార్తీక శుద్ధ ఏకాదశి సందర్భంగా కళ్యాణం నిర్వహించినట్లు ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర శర్మ తెలిపారు. ఉదయం 8 గంటలకు అనివేటి మండపంలో వేదమంత్రాలు, మంగళవాయిద్యాల నడుమ కళ్యాణం జరిగిందని ఆలయ డీసీ ప్రసాద్ తెలిపారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
News November 1, 2025
శ్రీకాకుళం జిల్లాలో కలకలం రేపుతున్న దొంగతనాలు

జిల్లాలో వరుస చోరీ ఘటనలు ప్రజలకు భయాందోళన కలిగిస్తున్నాయి. తూ.గో జిల్లా నుంచి వచ్చి ఇక్కడ చోరీలు చేస్తున్న ముగ్గురిని పోలీసులు ఇటీవల పట్టుకున్నారు. ఈ నెల 10న నరసన్నపేటలో ట్రాన్స్‌జెండర్లు చైన్‌స్నాచింగ్‌లకు పాల్పడ్డారు. తాజాగా కాశీబుగ్గలో చోరీ, సారవకోట(M) బుడితిలో వృద్ధురాలి మెడలో బంగారం చోరీ చేశారు. ఇప్పటికే పదుల సంఖ్యలో కేసులున్న AP, ఇతర రాష్ట్రాలకు చెందిన వారు ఈ కేసుల్లో నిందితులుగా ఉన్నారు.
News November 1, 2025
టెక్కలిలో యువకుడిపై పొక్సో కేసు నమోదు

టెక్కలికి చెందిన ఓ యువకుడిపై శుక్రవారం పోలీసులు పొక్సో కేసు నమోదు చేశారు. టెక్కలి సీఐ విజయ్ కుమార్ వివరాల ప్రకారం.. తన ఇంటి సమీపంలోని మైనర్ బాలికను కొంతకాలంగా యువకుడు వేధిస్తున్నాడు. ఇటీవల తల్లితండ్రులు ఇంట్లో లేనప్పుడు బాలికకు మాయమాటలు చెప్పి బయటకు తీసుకెళ్లాడని తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేశారు.


