News July 17, 2024
ITR ఫైలింగ్ గడువు పొడిగిస్తారా?

ITR దాఖలులో పలువురు ఇంకా సమస్యలు ఎదుర్కొంటున్నారు. దీంతో గడువు పొడిగిస్తారనే ప్రచారం జరుగుతోంది. ఈ-ఫైలింగ్ సైట్లో లాగిన్ ఇబ్బందులు, పాస్‌వర్డ్ రీసెట్, ఈ-వెరిఫికేషన్‌లోనూ సమస్యలున్నట్లు చార్టెడ్ అకౌంటెంట్లు, పలువురు ఆర్థిక నిపుణులు ఆదాయ పన్ను శాఖ దృష్టికి తీసుకెళ్లారు. కాగా జులై 31తో ఈ గడువు ముగియనుంది. ఇక జులై 14 వరకు 2.7కోట్ల రిటర్నులు దాఖలైనట్లు సమాచారం. గతేడాదితో పోల్చితే ఇది 13% అధికం.
Similar News
News October 29, 2025
ఈ జిల్లాల్లో యథావిధిగా స్కూళ్లు

AP: మొంథా తుఫాను బలహీనపడింది. వర్షాలు తగ్గుముఖం పట్టడంతో నిన్నటి వరకు సెలవులు కొనసాగిన అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో ఇవాళ స్కూళ్లు యథావిధిగా నడవనున్నాయి. ఈమేరకు అధికారులు వెల్లడించారు. అటు తిరుపతి జిల్లాకు తొలుత ఇవాళ కూడా హాలిడే ప్రకటించినా.. తుఫాను ప్రభావం లేకపోవడంతో సెలవు రద్దు చేశారు. స్కూళ్లు కొనసాగుతాయని, విద్యార్థులు రావాలని సూచించారు.
News October 29, 2025
బ్రెయిన్ స్ట్రోక్.. సత్వర వైద్యమే కీలకం

హైబీపీ, డయాబెటిస్, ఊబకాయం, ఒత్తిడి వల్ల మహిళల్లోనూ బ్రెయిన్ స్ట్రోక్ కేసులు పెరుగుతున్నాయని న్యూరాలజిస్ట్ మురళీధర్‌రెడ్డి తెలిపారు. ‘మొత్తం బాధితుల్లో 30-45 ఏళ్ల వయసున్న వారు 15% వరకు ఉంటున్నారు. సకాలంలో చికిత్స చేయిస్తేనే ప్రాణాపాయాన్ని తప్పించవచ్చు. ఒక్కసారిగా మైకం, చూపుపోవడం, ముఖం ఒకవైపు జారిపోవడం, అవయవాల బలహీనం, మాట అస్పష్టత దీని లక్షణాలు’ అని పేర్కొన్నారు.
News October 29, 2025
బ్రెయిన్ స్ట్రోక్ నిర్ధారణ, చికిత్స ఇలా

మస్తిష్క రక్తనాళాల్లో ఏర్పడే వైఫల్యంతో బ్రెయిన్ స్ట్రోక్ సంభవిస్తుందని న్యూరాలజిస్ట్ మురళీధర్‌రెడ్డి తెలిపారు. CT స్కాన్, MRI, రక్త పరీక్షలు, ఎలక్ట్రో కార్డియోగ్రామ్, కరోటిడ్ అల్ట్రాసౌండ్, సెరెబ్రల్ యాంజియోగ్రామ్ వంటి టెస్టుల ద్వారా స్ట్రోక్‌ను నిర్ధారిస్తారన్నారు. ఫిజియోథెరపీతో పాటు, యాంటీ ప్లేట్‌లెట్లు, యాంటీ కాగ్యులెంట్లు, స్టాటిన్లు తీసుకోవడం ద్వారా ప్రాణాపాయాన్ని తప్పించవచ్చని పేర్కొన్నారు.


