News July 17, 2024
ఉద్యోగాల్లో అగ్నివీర్‌లకు 10% రిజర్వేషన్లు: హరియాణా ప్రభుత్వం

సైన్యంలో పని చేసే అగ్నివీర్‌లకు పలు ప్రభుత్వ ఉద్యోగాల్లో 10% రిజర్వేషన్లు కల్పించనున్నట్లు హరియాణా CM నాయబ్ సైనీ ప్రకటించారు. కానిస్టేబుల్, మైనింగ్ గార్డ్, ఫారెస్ట్ గార్డ్, జైల్ వార్డెన్ నియామకాల్లో రిజర్వేషన్లు కల్పిస్తున్నట్లు తెలిపారు. కాగా ఇప్పటికే కానిస్టేబుల్ నియామకాల్లో CISF, BSF, CRPF వంటి కేంద్ర సంస్థల్లో అగ్నివీర్‌లకు 10% రిజర్వేషన్లు కల్పిస్తున్నట్లు కేంద్రం ప్రకటించిన సంగతి తెలిసిందే.
Similar News
News January 25, 2026
రేపు ఢిల్లీలో కాంగ్రెస్ PCCల భేటీ

AICC అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అధ్యక్షతన రేపు ఢిల్లీలో PCCల సమావేశం జరగనుంది. ఈ భేటీకి రాహుల్ గాంధీ హాజరయ్యే అవకాశం ఉంది. కేంద్రం MGNREGAను జీ రామ్ జీ బిల్లుగా మార్చిన అంశంపై దేశవ్యాప్తంగా ఆందోళన చేపట్టే దిశగా చర్చించనున్నారు. అలాగే రాబోయే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై వ్యూహాలతో పాటు ఈనెల 28 నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వైఖరిపై సమాలోచనలు జరగనున్నాయి.
News January 25, 2026
శుభాంశు శుక్లాకు అశోక చక్ర

77వ రిపబ్లిక్ దినోత్సవం సందర్భంగా 70 మంది సాయుధ దళాల సిబ్బందికి శౌర్య పురస్కారాలను రాష్ట్రపతి ముర్ము ప్రకటించారు. గతేడాది అంతరిక్ష యాత్ర పూర్తి చేసిన శుభాంశు శుక్లా(పైలట్)కు అశోక చక్ర అవార్డు వరించింది. ముగ్గురికి కీర్తి చక్ర, 13 మందికి శౌర్య చక్ర, ఒకరికి బార్ టు సేనా మెడల్(గ్యాలంటరీ), 44 మందికి సేనా మెడల్, ఆరుగురికి NAO సేనా మెడల్, ఇద్దరికి వాయు సేనా మెడల్ అందించనున్నారు.
News January 25, 2026
17న ఫ్రీగా ఆల్బెండజోల్ మాత్రల పంపిణీ

AP: వచ్చే నెల 17న రాష్ట్రంలో 1-19 ఏళ్లలోపు ఉన్న 1.11 కోట్ల మందికి ఆల్బెండజోల్ మాత్రలను ఉచితంగా ఇవ్వనున్నట్లు కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వీరపాండియన్ వెల్లడించారు. వీరిలో ఐదేళ్లలోపు పిల్లలు 23 లక్షల మంది ఉన్నారన్నారు. ‘నులిపురుగుల వల్ల ఆకలి లేకపోవడం, కడుపునొప్పి, వాంతులు, విరేచనాలు, రక్తహీనత, ఎదుగుదల లోపం వంటి సమస్యలు వస్తాయి. ఆల్బెండజోల్ మాత్రలతో వీటిని నివారించవచ్చు’ అని పేర్కొన్నారు.


