News July 17, 2024
ట్రంప్ మళ్లీ గెలిస్తే నాటో పాలసీల్లో మార్పు?

మరోసారి అధికారంలోకి వస్తే US అంతర్జాతీయ వ్యవహారాల్లో ట్రంప్ భారీ మార్పులు చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా నాటో వ్యవహారాల్లో US పాత్రను తగ్గించేందుకు ట్రంప్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. రష్యాపై యుద్ధంలో ఉక్రెయిన్‌కు సాయం అందించినందుకు అమెరికాకు $200 బిలియన్లు పరిహారం చెల్లించమని ఐరోపాను అడుగుతానని ప్రచారం సందర్భంగా ట్రంప్ చెబుతున్నారు. ఉక్రెయిన్‌కు సాయాన్ని కొనసాగించడంపైనా ట్రంప్ విముఖంగా ఉన్నారు.
Similar News
News April 8, 2026
ప్రియుడితో నటి బ్రేకప్!

‘దంగల్’ నటి సాన్యా మల్హోత్రా ప్రియుడికి బ్రేకప్ చెప్పినట్లు బాలీవుడ్ వర్గాలు పేర్కొన్నాయి. సితారిస్ట్ రిషబ్ రిఖిరామ్‌తో ఏడాదిగా ఆమె డేటింగ్ చేస్తున్నారు. విడిపోవాలని నిర్ణయించుకున్న వారిద్దరూ తాజాగా SMలో అన్‌ఫాలో చేసుకున్నారు. రిషబ్ మరో యువతితో డేటింగ్‌లో ఉండటమే ఇందుకు కారణమని టాక్. ఇక సాన్యా మల్హోత్రా.. బదాయ్ హో, జవాన్, థగ్ లైఫ్, బేబీ జాన్ తదితర చిత్రాల్లో నటించి గుర్తింపు పొందారు.
News April 8, 2026
మావిగన్‌పై మంత్రి లోకేశ్ సెటైరికల్ ట్వీట్

AP: రాష్ట్ర రాజధానిగా వైసీపీ చీఫ్ జగన్ ప్రతిపాదించిన మావిగన్‌పై మంత్రి లోకేశ్ సెటైరికల్ ట్వీట్ చేశారు. మా..య, వి..ధ్వంసం, గన్..దరగోళం/గన్.. కల్చర్ అంటూ పేర్కొన్నారు. ఇదేనా జగన్ మీ ప్లాన్ B అంటూ ఓ ఫొటో రిలీజ్ చేశారు. మావిగన్ అంశంపై కూటమి, వైసీపీ నేతలు కొన్ని రోజులుగా విమర్శలు, ప్రతివిమర్శలు చేసుకుంటున్న విషయం తెలిసిందే.
News April 8, 2026
రేపు జీవన్ రెడ్డిని కలవనున్న KTR

TG: అంతర్గత కుమ్ములాటలతో ఇటీవల కాంగ్రెస్‌ను <<19472372>>వీడిన<<>> సీనియర్ నేత జీవన్ రెడ్డిని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR రేపు కలవనున్నారు. జగిత్యాల వెళ్లి ఆయనను పార్టీలోకి ఆహ్వానించనున్నారు. ఈనెల 13న KCR సమక్షంలో జీవన్ రెడ్డి గులాబీ కండువా కప్పుకునే అవకాశం ఉంది. ఇప్పటికే MLA సంజయ్ BRS నుంచి INCలో చేరగా, కాంగ్రెస్‌లో ఉన్న జీవన్ రెడ్డి BRSలోకి వెళ్లనున్నారు. దీంతో జగిత్యాల రాజకీయాలు రసవత్తరంగా మారనున్నాయి.


