News July 17, 2024
సాగర్ కుడి కాలువకు తాగునీటి విడుదల

తెలంగాణ, ఏపీకి తాగు నీటిని విడుదల చేసేందుకు కృష్ణా రివర్ బోర్డ్ అనుమతించిన నేపథ్యంలో నాగార్జునసాగర్ ప్రాజెక్టు నుంచి ఆంధ్ర ప్రాంతం పరిధిలోని కుడి కాల్వకు డ్యాం అధికారులు 5,598 క్యూసెక్కుల తాగునీటిని విడుదల చేశారు. సాగర్ డ్యాం పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులకు గాను ప్రస్తుతం 504.40 అడుగుల నీరు నిల్వ ఉంది. HYD తాగునీటి అవసరాల కోసం ఎస్ఎల్బీసీకి 800 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు.
Similar News
News August 13, 2025
మాదక ద్రవ్యాల రహిత సమాజానికి కృషి: నల్గొండ SP

మాదక ద్రవ్యాల రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ కోరారు. నషా ముక్త్ భారత్ అభియాన్‌లో భాగంగా మాదక ద్రవ్యాల దుర్వినియోగంపై జిల్లా పోలీసులు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. విద్యార్థి దశలో మాదక ద్రవ్యాల మాయలో పడితే జీవితం వృథా అవుతుందని తెలిపారు. డ్రగ్స్ వాడకం వల్ల శారీరక, మానసిక ఆరోగ్యం దెబ్బతింటుందన్నారు.
News August 13, 2025
నల్గొండ: పోక్సో నిందితుడికి జీవిత ఖైదు

నల్గొండ కోర్టు సంచలన తీర్పు వెలువడించింది. మైనర్ బాలికపై అత్యాచారం కేసులో పోక్సో నిందితుడు గ్యారాల శివకుమార్‌కి జీవిత ఖైదీ విధిస్తూ బుధవారం మెజిస్ట్రేట్ తీర్పునిచ్చారు. 2023లో మైనర్ బాలికను బలవంతంగా పెళ్లి చేసుకొని అత్యాచారం చేశాడనే ఆరోపణపై శివకుమార్‌పై నల్గొండ వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో పోక్సో కేసు నమోదైంది.
News August 13, 2025
NLG: 12 గంటల్లోనే పట్టుకున్నారు..!

కోర్టు నుంచి తప్పించుకున్న నిందితుడిని వన్ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ మైనర్ బాలికపై లైంగికదాడి ఘటనలో నిన్న తుది తీర్పు వెలువడిన క్రమంలో భయభ్రాంతులకు గురై నిందితుడు పారిపోయిన విషయం తెలిసిందే. నిందితుడు గ్యారాల శివకుమార్‌పై ప్రత్యేక నిఘా పెట్టిన వన్ టౌన్ సీఐ ఏమిరెడ్డి రాజశేఖర్ రెడ్డి ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టి 12 గంటల్లోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.