News July 17, 2024

వరంగల్: ఉరివేసుకుని విద్యార్థిని ఆత్మహత్య

image

వరంగల్ జిల్లాలో విషాదం నెలకొంది. స్థానికుల ప్రకారం.. గీసుకొండ మండలం దస్రుతండాకు చెందిన నందు ఐనవోలు స్తూర్బాగాంధీ విద్యాలయంలో ఇంటర్ ఫస్టియర్ చదువుతోంది. అయితే ఈనెల 9న తండ్రి కిషోర్ పనిచేస్తున్న బొల్లికుంట వాగ్దేవి కాలేజీ హాస్టల్‌కి హోంసిక్ హలీడెస్‌కు వచ్చిన నందు.. నేడు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. MGMలో పోస్టుమార్టం అనంతరం స్వగ్రామానికి మృతదేహాన్ని తరలించారు. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

Similar News

News January 19, 2026

వరంగల్: ఇక పట్టణాల్లో ఇందిరమ్మ చీరలు..!

image

గ్రామ పంచాయతీ ఎన్నికలకు ముందు ఇందిరా మహిళా శక్తి పేరిట మహిళలకు ప్రభుత్వం చీరలను పంపిణీ చేసింది. ప్రస్తుతం మునిసిపల్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పట్టణాల్లో పంపిణీ చేయడానికి సన్నాహాలు చేపట్టింది. జిల్లాలో వర్ధన్నపేట, నర్సంపేట మునిసిపాలిటీలు ఉండడంతో స్థానిక ఎమ్మెల్యేలు చీరలను పంపిణీ చేయడానికి గాను సిద్ధమయ్యారు. నోటిఫికేషన్ వెలువడక ముందే చీరల పంపిణీ పూర్తి చేయాలని నేతలు భావిస్తున్నారు.

News January 17, 2026

WGL: పరిశ్రమలతో 6,810 మందికి ఉపాధి: కలెక్టర్

image

వరంగల్ జిల్లాలో పారిశ్రామికాభివృద్ధి, ఉద్యోగ అవకాశాల కల్పనే లక్ష్యంగా ఇప్పటికి 48 పరిశ్రమలకు అనుమతులు మంజూరు చేసినట్లు కలెక్టర్ సత్యశారద తెలిపారు. కలెక్టరేట్‌లో జిల్లా పరిశ్రమల ప్రోత్సాహక కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడారు. రూ.380.53 కోట్ల పెట్టుబడులు రావడంతో పాటు 6,810 మందికి ఉపాధి లభిస్తుందన్నారు. నిబంధనల మేరకు దరఖాస్తు చేసుకున్న పారిశ్రామికవేత్తలకు త్వరితగతిన అనుమతులు మంజూరు చేయాలన్నారు.

News January 17, 2026

వరంగల్: గ్రూప్-3లో ఎంపికైన అభ్యర్థికి నియామక ఉత్తర్వులు: వీసీ

image

ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన టీజీపీఎస్సీ గ్రూప్-3 ఉద్యోగ నియామక పరీక్షలో అర్హత పొందిన అభ్యర్థికి వరంగల్ కాళోజి ఆరోగ్య విశ్వవిద్యాలయంలో ఉద్యోగ నియామకం చేస్తూ విశ్వవిద్యాలయం ఉప కులపతి డాక్టర్ రమేశ్ రెడ్డి శుక్రవారం ఉత్తర్వులు అందజేశారు. ఎగ్జామినేషన్ కంట్రోలర్ డాక్టర్ మల్లేశ్వర్, శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.