News July 17, 2024
అతి భారీ వర్షాలు.. రేపు, ఎల్లుండి జాగ్రత్త

AP: అల్పపీడన ద్రోణి ప్రభావంతో రేపు, ఎల్లుండి కోస్తాంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. రేపు SKLM, VZM, మన్యం, VSP, అనకాపల్లి, KKD, కోనసీమ, తూ.గో, ప.గో, ELR, కృష్ణా, NTR, GNT, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నంద్యాల జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయంది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని.. అత్యవసర సహాయం కోసం 1070, 112, 18004250101 నంబర్లకు ఫోన్ చేయాలంది.
Similar News
News March 29, 2026
ఇలా చేస్తే మీ వెండి ఆభరణాలు మెరుస్తాయ్!

వెండి పట్టీలు, ఉంగరాలు, పూజా సామగ్రి తదితర వస్తువులు తరచూ నల్లగా మారుతుంటాయి. ఇంట్లో దొరికే పదార్థాలతోనే వాటిని మెరిసేలా చేయొచ్చు. బేకింగ్ సోడా, నీటిని కలిపి పేస్ట్‌లా చేసి బ్రెస్‌తో రుద్దితే కొత్తవాటిలా మెరుస్తాయి. ఇక వేడినీటిలో డిటర్జెంట్ పౌడర్ వేసి కాసేపు వెండి వస్తువులు అందులో ఉంచిన తర్వాత మృదువుగా రుద్దితే కొత్తరూపు వస్తుంది. ఉప్పు, టూత్ పేస్ట్‌నూ వాడి నల్ల వస్తువులను తెల్లగా మార్చుకోవచ్చు.
News March 29, 2026
పవర్‌ఫుల్ లీడర్స్: 13వ ప్లేస్‌లో CBN, 25వ ప్లేస్‌లో రేవంత్

దేశంలో శక్తిమంతమైన 100 మంది లీడర్ల లిస్ట్‌లో వరుసగా 12వ సారి మోదీ, అమిత్ షా తొలి రెండు స్థానాల్లో నిలిచారు. ‘AP CM CBN 13వ స్థానం, TG CM రేవంత్ 25వ ప్లేస్‌లో ఉన్నారు. పవన్ కళ్యాణ్(68), రామ్మోహన్ నాయుడు (90) కూడా చోటు దక్కించుకున్నారు’ అని Indian Express తెలిపింది. మరోవైపు అధికారంలో లేకపోవడంతో Ex CMలు KCR, జగన్ ఈ జాబితాలో లేరు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ 9, ICC చీఫ్ జైషా 22వ స్థానంలో నిలిచారు.
News March 29, 2026
దూసుకుపోతున్న విశాఖ పోర్టు.. 9 దశాబ్దాల రికార్డు బ్రేక్!

AP: విశాఖ పోర్టు చరిత్రాత్మక మైలురాయిని అందుకుంది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో 362 రోజుల్లో 90.29మిలియన్ మెట్రిక్ టన్నుల సరకు రవాణా చేసి అత్యధిక వార్షిక రికార్డు నమోదు చేసింది. గతేడాది నమోదైన 82.62MMTను అధిగమించింది. 9 దశాబ్దాల చరిత్రలో ఇదే అత్యుత్తమ ప్రదర్శన కావడం గమనార్హం. సమర్థవంతమైన నిర్వహణ, వ్యూహాత్మక ప్రణాళికలు, సిబ్బంది కృషి, భాగస్వామ్య సంస్థల సమన్వయంతోనే ఇది సాధ్యమైందని అధికారులు తెలిపారు.


