News July 17, 2024

లోకల్ రిజర్వేషన్ బిల్లు తయారీ దశలోనే ఉంది: కర్ణాటక GOVT

image

స్థానిక కోటా బిల్లు ఇంకా తయారీ దశలోనే ఉన్నట్లు కర్ణాటక ప్రభుత్వం ప్రకటించింది. దీనిపై తదుపరి కేబినెట్ భేటీలో సమగ్రంగా చర్చించి నిర్ణయం తీసుకుంటామని X ద్వారా వెల్లడించింది. కాగా ప్రైవేట్ కంపెనీల్లో నాన్ మేనేజ్‌మెంట్ రోల్స్‌లో 70%, మేనేజ్‌మెంట్ రోల్స్‌లో 50% పోస్టులను కన్నడిగులకే ఇవ్వాలనే బిల్లును కేబినెట్ ఇటీవల ఆమోదించింది. దీనిపై పరిశ్రమ వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.

Similar News

News April 6, 2026

పిరికివాడి మనస్తత్వం ఇలా ఉంటుంది!

image

మేడిపండు చూడ మేలిమై యుండును
పొట్ట విచ్చి చూడ పురుగులుండు
పిరికివాని మదిని బింకమీలాగురా
విశ్వదాభిరామ! వినుర వేమ!!
తాత్పర్యం: మేడిపండు చూడటానికి ఎంతో అందంగా ఉంటుంది. కానీ దాన్ని కోసి చూస్తే పురుగులు ఎక్కువగా కనిపిస్తాయి. అలాగే పిరికివాడు పైకి చాలా ధైర్యంగా, గొప్పగా మాట్లాడుతాడు. కానీ మనసులో భయంతో నిండి ఉంటాడు.
<<-se>>#PADHYAM<<>>

News April 6, 2026

డ్రైవింగ్ లైసెన్స్ జారీకి త్వరలో కొత్త నిబంధన!

image

TG: డ్రైవింగ్ లైసెన్స్ మంజూరుకు త్వరలో రోడ్ సేఫ్టీ టెస్టును తప్పనిసరి చేయనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం లెర్నర్ లైసెన్స్ రిజిస్ట్రేషన్ టెస్ట్, డ్రైవింగ్ స్కిల్ టెస్ట్ నిర్వహించి లైసెన్స్ ఇస్తున్నారు. ఇక నుంచి వీటి కంటే ముందు రోడ్ సేఫ్టీ టెస్ట్ నిర్వహించాలని ఆర్టీఏ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. దీనిపై ఓ కమిటీని ఏర్పాటు చేయనున్నారు. కమిటీ నివేదిక వచ్చాక కొత్త రూల్ అమల్లోకి వచ్చే అవకాశముంది.

News April 6, 2026

IPL: ఈరోజైనా KKR బోణీ కొడుతుందా?

image

ఐపీఎల్-2026లో ఈరోజు రా.7.30 గంటలకు కోల్‌కతా వేదికగా KKR, PBKS తలపడనున్నాయి. టోర్నీ చరిత్రలో ఈ రెండు జట్లు ఇప్పటివరకు 35 మ్యాచులు ఆడగా 21 విజయాలతో KKR పైచేయి సాధించింది. కానీ ప్రస్తుత సీజన్‌లో KKR ఫామ్‌లో లేదు. ఇప్పటివరకు రెండు మ్యాచులాడి రెండింట్లోనూ ఓడింది. అటు పంజాబ్ ఆడిన 2 మ్యాచుల్లోనూ గెలిచి అన్ని విభాగాల్లో దూసుకుపోతోంది. మరి ఈరోజు విజయం ఎవరిదో కామెంట్ చేయండి.