News July 17, 2024
తిరుపతి లడ్డూ తయారీపై ప్రచారం ఫేక్: TTD

తిరుమల శ్రీవారి లడ్డూ తయారీని థామస్ అనే కాంట్రాక్టర్‌కు ఇచ్చినట్లు జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని TTD స్పష్టం చేసింది. ఇలాంటి తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దని కోరింది. శ్రీవారి లడ్డూ తయారీలో ప్రస్తుతం 980 మంది హిందువులు పాల్గొంటున్నారని తెలిపింది. లడ్డూను కొన్ని శతాబ్దాలుగా వైష్ణవ బ్రాహ్మణులే తయారు చేస్తున్నారని స్పష్టం చేసింది.
Similar News
News March 25, 2026
ప్రయాణికులకు TGSRTC గుడ్ న్యూస్

TG: హైదరాబాద్ వాసులకు రాష్ట్ర ఆర్టీసీ శుభవార్త చెప్పింది. సిటీ మెట్రో ఏసీ, డీలక్స్ బస్సుల్లో 30శాతం డిస్కౌంట్ ఇస్తున్నట్లు ప్రకటించింది. పెట్రోల్ బంకుల వద్ద బారులు తీరొద్దని.. సురక్షితంగా బస్సులో ప్రయాణించమని ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి సూచించారు. ప్రస్తుతం నగరంలో 3,200 బస్సులు అందుబాటులో ఉన్నాయని, అవసరమైతే అదనపు బస్సులు నడుపుతామని చెప్పారు.
News March 25, 2026
మీలాంటి వారితో ఎప్పటికీ చర్చలు జరపం: IRGC

ఓవైపు శాంతి చర్చలు జరుగుతున్నాయని US అధ్యక్షుడు ట్రంప్, US మీడియా చెబుతుంటే ఇరాన్ మాత్రం వాటిని కొట్టిపారేస్తోంది. ట్రంప్ వంటి వ్యక్తులతో ఇరాన్ ఎన్నటికీ చర్చలు జరపదని IRGC స్పష్టం చేసింది. ఓటమిని ఒప్పందం పేరుతో కప్పిపుచ్చుకోవద్దని.. మీలో మీరే చర్చించుకునే స్థాయికి అంతర్గత కలహాలు చేరాయని ఎద్దేవా చేసింది. తమ సైన్యంతోనే ఇక్కడ స్థిరత్వం ఏర్పడుతుందని US గ్రహించే వరకు ఆయిల్ ధరలు తగ్గవంది.
News March 25, 2026
టీడీపీ ఎమ్మెల్యే కుమార్తె పెళ్లి.. హాజరైన ఏపీ, టీజీ సీఎంలు

AP: టీడీపీ సీనియర్ నేత, పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ కుమార్తె వైదీప్తి వివాహానికి ఇరు రాష్ట్రాల సీఎంలు హాజరయ్యారు. గుంటూరులో జరిగిన ఈ వేడుకకు ఏపీ సీఎం, టీడీపీ చీఫ్ చంద్రబాబు.. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వేర్వేరుగా హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా ఏపీ ఐటీ మంత్రి లోకేశ్‌తో రేవంత్ ముచ్చటించారు.


