News July 17, 2024

చిక్కుల్లో ట్రైనీ IAS తండ్రి దిలీప్

image

మహారాష్ట్రకు చెందిన ట్రైనీ IAS పూజా ఖేడ్కర్ అధికార దుర్వినియోగంతో పాటు యూపీఎస్సీకి తప్పుడు సమాచారం ఇచ్చారని ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. కాగా ఇప్పుడు ఆమె తండ్రి దిలీప్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. దిలీప్ ఖేడ్కర్ <<13605832>>ఆస్తులపై<<>> విచారణకు పుణేలోని ACB సిద్ధమైంది. మరోవైపు పూజ పేరెంట్స్ ఓ రైతును పిస్తల్‌తో బెదిరించిన ఘటనలో ఇప్పటికే ఇంకో కేసు నమోదైంది.

Similar News

News March 26, 2026

సమ్మర్ స్పెషల్: మీ పిల్లలను ఛాంపియన్లుగా మార్చండి!

image

వేసవి సెలవుల్లో పిల్లల సమయాన్ని వృథా చేయకుండా ఓ కొత్త నైపుణ్యాన్ని నేర్పించండి. ముఖ్యంగా పిల్లల శారీరక దృఢత్వంపై దృష్టి సారించాలి. ఎండ తీవ్రత దృష్ట్యా ఉదయం, సాయంత్రం వేళల్లో స్విమ్మింగ్ నేర్పించడం వల్ల శరీరం చల్లబడటమే కాక మంచి వ్యాయామం లభిస్తుంది. అలాగే ఏకాగ్రత కోసం యోగా, మెడిటేషన్.. ఆత్మరక్షణ కోసం మార్షల్ ఆర్ట్స్ నేర్పించాలి. ఇవి పిల్లలను శారీరకంగా, మానసికంగా దృఢంగా మారుస్తాయి. <<-se>>#SummerSPL<<>>

News March 26, 2026

ఏదో ఒకటి తేల్చుకోండి.. లేకపోతే: ట్రంప్

image

తమతో డీల్‌ కోసం ఇరాన్ అడుక్కుంటోందని US అధ్యక్షుడు ట్రంప్ తెలిపారు. కానీ బయటి ప్రపంచానికి మాత్రం మరోలా చెబుతోందన్నారు. ఏదో ఒక విషయం ఆ దేశం త్వరగా తేల్చుకోకపోతే పరిస్థితులు భయానకంగా ఉంటాయని హెచ్చరించారు. తాము ఒక్కసారి నిర్ణయం తీసుకుంటే వెనక్కి తిరిగి చూడబోమని తేల్చి చెప్పారు. కాగా 5 రోజులు యుద్ధానికి బ్రేక్ ఇచ్చామని ఇటీవల ఆయన ప్రకటించగా, తమకు అగ్రరాజ్యం భయపడిందని ఇరాన్ చెప్పిన విషయం తెలిసిందే.

News March 26, 2026

మొదలైన SRHvsLSG టికెట్ల సేల్స్

image

IPL-2026 సందడి మొదలైంది. ఏప్రిల్ 5న హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో జరిగే SRHvsLSG మ్యాచ్ టికెట్లు రిలీజ్ అయ్యాయి. District యాప్‌ ద్వారా ఆన్‌లైన్‌లో టికెట్లను <>బుక్<<>> చేసుకోవచ్చు. రూ.850 నుంచి రూ.23,000వరకు టికెట్ ధరలున్నాయి. సొంత గడ్డపై ఆరెంజ్ ఆర్మీ ఆడే తొలి మ్యాచ్ ఇదే.