News July 17, 2024

ఎన్‌కౌంటర్‌లో లక్ష్మణ్ ఆత్రం మృతి

image

మహారాష్ట్ర గడ్చిరోలిలో జరిగిన <<13649598>>ఎన్‌కౌంటర్‌లో<<>> తిపాగడ్ దళం ఇంఛార్జి డీవీసీఎం లక్ష్మణ్ ఆత్రం అలియాస్ విశాల్ చనిపోయినట్లు పోలీసులు వెల్లడించారు. ఇవాళ మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు దాదాపు 6 గంటల పాటు కాల్పులు జరిగినట్లు తెలిపారు. ఇప్పటివరకు 12 మంది మావోయిస్టుల మృతదేహాలను స్వాధీనం చేసుకోగా.. అందులో ఇద్దరు తెలుగువారు ఉన్నట్లు సమాచారం. ఇక కాల్పుల్లో గాయపడ్డ జవాన్‌ను చికిత్స కోసం నాగ్‌పుర్‌కు తరలించారు.

Similar News

News January 22, 2025

దావోస్‌లో టీమ్ ఇండియా: సీఎం చంద్రబాబు

image

ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్, మహారాష్ట్ర సీఎం ఫడణవీస్ దావోస్‌లో భేటీ అయ్యారు. ‘వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌లో టీమ్ ఇండియా’ అంటూ ఈ ఫొటోను చంద్రబాబు Xలో పోస్ట్ చేశారు. దేశం, రాష్ట్రాల అభివృద్ధి, సంక్షేమం, ఆర్థిక వ్యవస్థ, ఆవిష్కరణలు, సాంకేతికత, ఏఐ, ఉద్యోగాలు వంటి అనేక అంశాలపై వీరు చర్చించినట్లు సమాచారం.

News January 22, 2025

విజయ పరంపర కొనసాగుతుందా?

image

ఇంగ్లండ్‌తో జరగనున్న టీ20 సిరీస్‌కు టీమ్ఇండియా సన్నద్ధమవుతోంది. ఈక్రమంలో ఇప్పటికే జట్టును బీసీసీఐ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇంగ్లండ్‌తో జరిగిన చివరి 4 టీ20 సిరీస్‌లలో ఇండియా ఒక్కసారి కూడా ఓడిపోలేదు. ఈ సిరీస్ కూడా గెలుపొంది వరుసగా 5 టీ20 సిరీస్‌లు గెలిచి రికార్డు సృష్టిస్తుందని నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. కోహ్లీ కెప్టెన్‌గా మూడు సార్లు గెలిస్తే రోహిత్ సారథ్యంలో ఇండియా ఒకసారి గెలిచింది.

News January 22, 2025

పుణేలో అరుదైన వ్యాధి కలకలం.. 22 కేసులు నమోదు

image

పుణేలో గిలియన్ బార్ సిండ్రోమ్ కలకలం రేపుతోంది. ఇప్పటివరకు 22 కేసులు వెలుగుచూశాయి. బాధితుల్లో 12-30 ఏళ్ల వయసు వారు ఎక్కువగా ఉన్నారని అధికారులు తెలిపారు. శాంపిల్స్‌ను టెస్టుల కోసం ICMR-NIVకి పంపామన్నారు. కలుషితమైన నీరు/ఆహారం కారణమై ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ఈ నాడీ సంబంధిత వ్యాధి సాధారణంగా వైరల్/బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ లేదా వ్యాక్సినేషన్ వల్ల వచ్చే ఛాన్సుందని డాక్టర్లు చెబుతున్నారు.