News July 17, 2024
ప్రమాద స్థాయికి డుడుమ జలాశయ నీటిమట్టం

ఆంధ్రా-ఒడిశా రాష్ట్రాలు ఉమ్మడిగా నిర్వహిస్తున్న మాచ్‌ఖండ్ జల విద్యుత్ కేంద్రానికి నీరు అందించే డుడుమ జలాశయ నీటిమట్టం ప్రమాదస్థాయికి చేరుకుంది. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 2,590 అడుగులు కాగా.. బుధవారం సాయంత్రానికి 2,586 అడుగులుగా నమోదయింది. ప్రస్తుతం సరిహద్దు గ్రామాల్లో విస్తారంగా వర్షాలు పడుతుండడంతో డుడుమ జలాశయంలోకి వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. దీంతో నీటిమట్టం ప్రమాద స్థాయికి చేరుకుంది.
Similar News
News January 11, 2026
విశాఖ పోలీసులను అభినందించిన జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి డోలా

విశాఖలో మహిళపై దాడి కేసులో స్పష్టమైన ఆధారాలు లేకున్నా పోలీసులు కేసు ఛేదించారని మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి పేర్కొన్నారు. ఈ ఘటనలో పోలీసులు స్పందించిన తీరు, వేగవంతమైన దర్యాప్తు అభినందనీయమని ఆయన కొనియాడారు. కూటమి పాలనలో రాష్ట్రంలో శాంతిభద్రతలు ఎలా ఉన్నాయనేందుకు ఇదే నిదర్శనమన్నారు. మహిళల రక్షణలో దేశంలోనే విశాఖకు మొదటి స్థానం కూటమి ఘనతే అన్నారు.
News January 11, 2026
విశాఖ జూ పార్క్‌లో ముగిసిన వింటర్ క్యాంప్

విశాఖ జూ పార్క్‌లో 4 రోజుల నుంచి జరుగుతున్న వింటర్ క్యాంప్ ఆదివారంతో ముగిసింది. జనవరి 8వ తేదీ నుంచి 11వ తేదీ వరకు ఈ క్యాంప్ నిర్వహించిన్నట్లు క్యూరేటర్ మంగమ్మ తెలిపారు. వింటర్ క్యాంప్‌తో వన్యప్రాణుల ప్రపంచాన్ని పిల్లలకు పరిచయం చేశారు. ముఖ్యంగా జూ పార్కులో వెటర్నరీ హాస్పిటల్, జంతువుల నివాసాలు, వాటి ఆహారపు అలవాట్లు, వాటి ప్రత్యేక లక్షణాలపై అవగాహన కల్పించారు.
News January 11, 2026
సైబర్ క్రైమ్ ముఠా ఉచ్చు నుంచి బయటపడ్డ ఉత్తరాంధ్ర యువకులు

ఉపాధి కోసం విదేశాలకు వెళ్లిన విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం ప్రాంతాలకు చెందిన 27 మంది యువకులు మయన్మార్‌లో సైబర్ క్రైమ్ ముఠాకు చిక్కుకొని నరకయాతన పడ్డారు. యువకులు ఈ విషయాన్ని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడి దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన స్పందించి విదేశాంగ శాఖ మంత్రితో మాట్లాడి తిరిగి మన దేశానికి తీసుకొచ్చారు. ఆదివారం విశాఖ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న యువకులు మంత్రికి, ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.


