News July 18, 2024
నేడు కేంద్ర కేబినెట్ భేటీ.. బడ్జెట్‌పై చర్చ!
PM మోదీ అధ్యక్షతన కేంద్ర మంత్రివర్గం ఇవాళ భేటీ కానుంది. ఉ.10:30కి ప్రారంభమయ్యే ఈ సమావేశంలో బడ్జెట్ సెషన్ నిర్వహణపై చర్చ జరగనున్నట్లు సమాచారం. ఈ భేటీ అనంతరం సాయంత్రం ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో పార్టీ నేతలతో ప్రధాని మోదీ సమావేశం కానున్నారు. ఈనెల 22 నుంచి జరిగే బడ్జెట్ సమావేశాల్లో అనుసరించబోయే వ్యూహాలతో పాటు యూపీ, మహారాష్ట్ర, హర్యానాలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలపై దిశానిర్దేశం చేయనున్నారు.
Similar News
News January 22, 2025
నోటిఫికేషన్ వచ్చేసింది..
UPSC సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ (CSE) నోటిఫికేషన్ రిలీజైంది. 979 పోస్టుల భర్తీకి జనవరి 22 నుంచి ఫిబ్రవరి 11 వరకు అప్లికేషన్లు స్వీకరించనున్నారు. మే 25న ప్రిలిమ్స్ జరగనుంది. బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసిన వారు, 21-32 ఏళ్ల వయసు ఉన్నవారు దీనికి అర్హులు. దరఖాస్తు చేసుకునేందుకు సైట్: <
News January 22, 2025
అమరావతికి హడ్కో రూ.11వేల కోట్ల నిధులు: మంత్రి నారాయణ
AP: రాజధాని అమరావతి నిర్మాణం కోసం హడ్కో రూ.11వేల కోట్ల నిధులు విడుదల చేసేందుకు అంగీకరించిందని మంత్రి నారాయణ తెలిపారు. ముంబైలో జరిగిన బోర్డు సమావేశంలో ఈ నిర్ణయం తీసుకుందని చెప్పారు. హడ్కో ద్వారా రూ.11వేల కోట్ల రుణం పొందేందుకు చర్చలు జరిపామన్నారు. దీంతో రాజధాని పనులు వేగవంతం అవుతాయని నారాయణ పేర్కొన్నారు.
News January 22, 2025
కృష్ణ జన్మభూమి కేసు: స్టే పొడిగించిన సుప్రీంకోర్టు
మథురలో షాహీ ఈద్గాను కోర్టు కమిషనర్ తనిఖీ చేయాలన్న అలహాబాద్ హైకోర్టు ఆర్డర్‌పై తాత్కాలిక స్టేను సుప్రీంకోర్టు పొడిగించింది. 2025, ఏప్రిల్ 1కి విచారణను వాయిదా వేసింది. అప్పటి వరకు స్టే కొనసాగుతుందని తెలిపింది. కృష్ణ జన్మస్థానమైన ఇక్కడి మందిరాన్ని ఔరంగజేబు కూల్చేసి ఈద్గా నిర్మించాడన్నది చరిత్ర. ఇక్కడ పూజచేసుకొనే హక్కు కల్పించాలని హిందూ సంఘాలు స్థానిక కోర్టుకెళ్లడంతో వివాదం సుప్రీంకోర్టుకు చేరింది.