News July 18, 2024
తమిళనాడులో ‘దేవర’కు గట్టి పోటీ!

Jr.NTR నటిస్తున్న ‘దేవర’ సినిమా సెప్టెంబర్ 27న రిలీజ్ కానుండగా, తమిళ హీరో కార్తీ నటిస్తున్న ‘మెయియాజగన్’ కూడా అదే రోజున రిలీజ్ కానుంది. ఈ విషయాన్ని మూవీ మేకర్స్ తాజాగా ప్రకటించారు. ఇదే కాకుండా జయం రవి ‘బ్రదర్’, కెవిన్ ‘బ్లడీ బెగ్గర్’ కూడా అదే రోజున విడుదల కానున్నట్లు సమాచారం. దీని వల్ల తమిళనాడులో ‘దేవర’కు కలెక్షన్స్ తగ్గే అవకాశాలున్నాయని సినీవర్గాల్లో చర్చ జరుగుతోంది.
Similar News
News January 16, 2026
ఐఐటీ గువాహటిలో ఉద్యోగాలకు నోటిఫికేషన్

<
News January 16, 2026
ప్రీటెర్మ్ బర్త్కు ఇదే కారణం

గర్భధారణ తర్వాత తొమ్మిది నెలలు నిండాక బిడ్డకు జన్మనివ్వడం సాధారణం. కానీ మరికొందరిలో నెలలు నిండక ముందే ప్రసవం జరుగుతుంది. దీన్నే ప్రీటెర్మ్ బర్త్ అని కూడా అంటారు. ఇలా నెలల నిండకుండానే డెలివరీ కాకపోవడానికి పోషకాహార లోపం, రక్తహీనత, మానసిక సమస్యలే ముఖ్య కారణమని ఓ అధ్యయనంలో వెల్లడైంది. ఇలా ఎక్కువగా స్ట్రెస్ కాకుండా ప్రశాంతంగా ఉంటూ పోషకాహారం తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
News January 16, 2026
9 నెలల్లో భారత్ ఎగుమతులు 634 బిలియన్ డాలర్లు

భారత్ 2025-26 ఆర్థిక సంవత్సరంలో 9 నెలల్లో 4.33% వృద్ధితో 634 బిలియన్ డాలర్ల ఎగుమతులను నమోదు చేసింది. వాణిజ్య శాఖ ప్రాథమిక డేటా ప్రకారం ఏప్రిల్ నుంచి డిసెంబర్ మధ్య వస్తువుల ఎగుమతులు 330 బిలియన్ డాలర్లకు చేరాయి. ఇందులో ప్రధానంగా తృణధాన్యాలు, ఎలక్ట్రానిక్స్, జీడిపప్పు, మాంసం, పాల ఉత్పత్తులు ఉన్నాయి. ఇవన్నీ ఎక్కువగా అమెరికా, చైనా, UAE, స్పెయిన్, హాంకాంగ్ వంటి దేశాలకు ఎగుమతి అవుతున్నాయి.


