News July 18, 2024

GOOD NEWS: నేడు అకౌంట్లలోకి డబ్బులు

image

TG: రైతులకు రుణమాఫీ పథకాన్ని సీఎం రేవంత్ నేడు ప్రారంభించనున్నారు. సా.4 గంటలకు సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా రైతులతో మాట్లాడిన అనంతరం నిధులను విడుదల చేయనున్నారు. తొలి విడతలో భాగంగా ఇవాళ రూ.లక్షలోపు రుణాలున్న 11.50 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ కానున్నాయి. అగస్టు 15 నాటికి రూ.2లక్షల వరకు ఉన్న రుణాలను మాఫీ చేయనున్నట్లు ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది.

Similar News

News July 5, 2025

బాధ్యతలు స్వీకరించిన రామ్‌చందర్ రావు

image

TG: బీజేపీ రాష్ట్రాధ్యక్షుడిగా రామ్‌చందర్ రావు బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్‌లోని బీజేపీ ఆఫీస్‌లో కిషన్ రెడ్డి నుంచి ఆయన బాధ్యతలు తీసుకున్నారు. ఈ సందర్భంగా రామ్‌చందర్ రావును పలువురు నేతలు, నాయకులు సన్మానించి, శుభాకాంక్షలు తెలియజేశారు.

News July 5, 2025

వచ్చే నెలలో కొత్త రేషన్ కార్డులు

image

APలో స్మార్ట్ కార్డుల రూపంలో కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. QR కోడ్‌తో వివరాలు ప్రత్యక్షమయ్యేలా పాత కార్డుల స్థానంలో కొత్తవి ఆగస్టులో పంపిణీ చేయనుంది. నేతల ఫొటోలు లేకుండా, ప్రభుత్వ అధికారిక చిహ్నం, లబ్ధిదారు ఫొటో మాత్రమే ఉండేలా చర్యలు తీసుకుంటోంది. 1.46 కోట్ల పాత కార్డులతో పాటు కొత్తగా 2 లక్షల కొత్త రేషన్‌కార్డుదారులకు వచ్చే నెలలో వీటిని జారీ చేయనుంది.

News July 5, 2025

ఆస్పత్రి నుంచి కేసీఆర్ డిశ్చార్జ్

image

TG: మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఆయన HYDలోని నందినగర్ నివాసానికి చేరుకున్నారు. రెండు రోజులపాటు అక్కడే ఉండనున్నారు. ఇటీవల అస్వస్థతకు గురైన కేసీఆర్ సోమాజిగూడ యశోద ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే.