News July 18, 2024

DSC అభ్యర్థులకు అలర్ట్.. 15min ముందే గేట్లు క్లోజ్

image

TG: రాష్ట్రంలో 11,062 టీచర్ పోస్టుల భర్తీకి నేటి నుంచి వచ్చే నెల 5 వరకు DSC పరీక్షలు జరగనున్నాయి. మొత్తం 2.79 లక్షల మంది అభ్యర్థులు 14 జిల్లాల్లోని 56 పరీక్షా కేంద్రాల్లో పరీక్షలు రాయనున్నారు. ప్రతి రోజూ రెండు షిఫ్టుల్లో (9-11:30AM, 2-4:30PM) ఎగ్జామ్స్ జరగనుండగా, పరీక్షకు 15 నిమిషాల ముందే గేట్లు మూసివేస్తామని అధికారులు తెలిపారు. ఈ పరీక్షలను ప్రభుత్వం తొలిసారిగా ఆన్‌లైన్‌లో నిర్వహిస్తోంది.

Similar News

News March 26, 2026

పొట్టేళ్లకు ఎండు మేత చాలా ముఖ్యం

image

పొట్టేళ్ల పెంపకంలో పచ్చి మేత కంటే ఎండు మేతే చాలా ముఖ్యమని వెటర్నరీ నిపుణులు చెబుతున్నారు. వేరుశనగ పొట్టు, ఉలవ పొట్టు, కంది పొట్టు వంటి చాలా రకాల ఎండు మేతలు అందుబాటులో ఉన్నాయి. వీటిని పొట్టేళ్లు చాలా ఇష్టంగా తింటాయి. దీని వల్ల అవి చాలా ఆరోగ్యంగా ఉంటూ, ఎక్కువ బరువు పెరుగుతాయి. అందుకే పచ్చిమేత కాస్త తక్కువైనా, ఎండు మేతను వెటర్నరీ నిపుణుల సూచనలతో సరైన పరిమాణంలో అందేలా చూసుకోవాలి.

News March 26, 2026

రోజూ కాసేపు హాయిగా నవ్వితే..

image

నవ్వు బెస్ట్ మెడిసిన్ అంటున్నారు వైద్యులు. రోజూ కాసేపు మనస్ఫూర్తిగా నవ్వితే ఫిజికల్, మెంటల్ టెన్షన్లు, ఒత్తిడి, కోపం తగ్గుతాయంటున్నారు. ‘10-15ని.లు నవ్వితే 40 క్యాలరీలు ఖర్చవుతాయి. ఫీల్ గుడ్ హార్మోన్లయిన ఎండార్ఫిన్‌లు విడుదలవుతాయి. రోగనిరోధక శక్తి, రక్త నాళాల పనితీరు మెరుగుపడుతుంది. గుండె సమస్యలు, BP తగ్గుతాయి. క్యాన్సర్‌పై పోరాటంలోనూ సాయపడుతుంది’ అని పేర్కొంటున్నారు.
#ShareIt

News March 26, 2026

BREAKING: పెరిగిన బంగారం ధరలు

image

హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు ఇవాళ స్వల్పంగా పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.220 పెరిగి రూ.1,46,890కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.200 పెరిగి రూ.1,34,650 పలుకుతోంది. అటు వెండి ధరల్లో ఎలాంటి మార్పు లేదు. కేజీ సిల్వర్ రేటు రూ.2.60 లక్షలుగా ఉంది.