News July 18, 2024

మదనపల్లెలో వడ్డీ వ్యాపారి హత్య

image

మదనపల్లె పట్టణం వీవర్స్ కాలనీలో వడ్డీ వ్యాపారి దారుణ హత్యకు గురైన ఘటన తీవ్ర కలకలం రేపింది. పోలీసుల వివరాల మేరకు.. పట్టణంలోని నీరుగట్టువారిపల్లి రాముల గుడి వీధిలో ఉంటున్న నీరుగట్టి చెన్నారెడ్డి(65)ని వీవర్స్ కాలనీలోకి తీసుకెళ్లారు. అతి దారుణంగా హత్య చేసి అక్కడి నుంచి నిందితులు పరారయ్యారు. ఈ హత్య బుధవారం సాయంత్రం జరిగి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు దర్యాప్తులో ఉంది.

Similar News

News October 16, 2025

కల్యాణ రేవు జలపాతంలో యువకుడి గల్లంతు

image

పలమనేరు రూరల్ మండలంలో కళ్యాణ రేవు జలపాతంలో గురువారం సాయంత్రం ఓ యువకుడు గల్లంతయ్యాడు. పట్టణానికి చెందిన యూనిస్ (23) స్నేహితులతో కలిసి జలపాతం చూడటానికి వచ్చి ప్రమాదవశాత్తు నీటి ప్రవాహంలో కొట్టుకుపోయినట్లు స్నేహితులు సమాచారం అందించారు. కాగా దట్టమైన అడవిలో నెలకొన్న ఈ జలపాతం వద్దకు వెళ్లేందుకు వర్షం అడ్డంకిగా మారింది. పూర్తి సమాచారం పోలీసులు వెళ్లాడించాల్సి ఉంది.

News October 16, 2025

తోతాపురం సబ్సిడి పడలేదా.. ఇలా చేయండి.!

image

తోతాపూరి మామిడి రైతులకు అందించిన సబ్సిడీపై సందేహాలు ఉంటే టోల్ ఫ్రీ నంబర్‌ను సంప్రదించాలని
చిత్తూరు కలెక్టర్ సుమిత్ కుమార్ సూచించారు. తమ సందేహాలను 08572-242777 నంబర్ ద్వారా తెలుసుకోవచ్చాన్నారు. అర్హత ఉన్నా నగదు జమకాని రైతులు రైతు సేవా కేంద్రాలు, హార్టికల్చర్ కార్యాలయాలలో ఈనెల 30లోపు వినతి పత్రాలు అందజేయాలన్నారు. రెండు రోజుల్లో వాటిని పరిష్కరిస్తామన్నారు.

News October 16, 2025

ఏమాత్రం క్రేజ్ తగ్గని రాగి సంగటి, నాటుకోడి కూర.!

image

ప్రాచీన కాలంగా చిత్తూరుతోసహా సీమవాసుల ఆహారంలో రాగి సంగటి, నాటు కోడి పులుసు భాగమైంది. గతంలో పండుగలు, శుభకార్యాల సమయంలో దీనికి గ్రామాలలో అధిక ప్రాధాన్యం ఉండేది. ఇప్పుడు కూడా దాని క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. రాగులు, బియ్యంతో వండే సంగటి, నాటుకోడి ముక్కలతో ప్రత్యేకంగా తయారు చేసే పులుసు భోజన ప్రియులు ఎంతో ఇష్టంగా ఆరగిస్తారు. పలు హోటల్లలోను ఇది స్పెషల్ మెనూగా ఉంటుంది.
# నేడు ప్రపంచ ఆహార దినోత్సవం.