News July 18, 2024
ఈనెల 21 నుంచి యథావిధిగా రైళ్లు నిలుపుదల
నారయణాద్రి, విశాఖ, చెన్నై ఎక్స్‌ప్రెస్ రైళ్లను ఈనెల 19 నుంచి పిడుగురాళ్ల, నడికుడి స్టేషన్లలో నిలిపేదిలేదని రైల్వే అధికారులు ప్రకటించారు. దీంతో వెంటనే ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు రైల్వే అధికారులతో మాట్లాడారు. ప్రజల అవసరాల దృష్ట్యా రైళ్లను పిడుగురాళ్ల, నడికుడి రైల్వేస్టేషన్లలో నిలుపుదల చేయాలని కోరారు. రైల్వే అధికారులు స్పందించి ఈనెల 21 నుంచి 3 రైళ్లను నిలుపుదల చేస్తామని చెప్పారు.
Similar News
News November 29, 2024
గుంటూరు: బోరుగడ్డ అనిల్‌కు 14 రోజుల రిమాండ్
బోరుగడ్డ అనిల్‌కు మరో 14 రోజులు రిమాండ్‌ను గుంటూరు జిల్లా కోర్టు పొడిగించింది. సామాజిక మాధ్యమాల్లో అసభ్యకర దూషణలపై కేసులో బోరుగడ్డ అనిల్‌కు ఉత్తర్వులు ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు. దీంతో ఆయనను మళ్లీ రాజమండ్రి జైలుకు పట్టాభిపురం పోలీసులు తరలించారు. కాగా ఇప్పటికే అనిల్ పలు కేసుల్లో రిమాండ్ ఖైదీగా జైల్లో ఉన్నారు.
News November 29, 2024
రాజధానిలో భూ కేటాయింపులపై కేబినెట్ సబ్ కమిటీ భేటీ
రాజధానిలో సంస్థలకు భూకేటాయింపులపై మంత్రివర్గ ఉప సంఘం శుక్రవారం సాయంత్రం 4 గంటలకు భేటీ కానుంది. అమరావతి ప్రాంతంలో గతంలో పలు భూకేటాయింపులపై సంస్థల ఏర్పాటు, కొత్తగా భూ కేటాయింపులకు వచ్చిన ప్రతిపాదనలపై ముఖ్యంగా ఈ సమావేశంలో చర్చించనున్నారు. కేబినెట్ సబ్ కమిటీలో సభ్యులుగా ఉన్న మంత్రులు నారాయణ, కేశవ్, కొల్లు రవీంద్ర, దుర్గేశ్, టీజీ భరత్, సంధ్యారాణి, పలు శాఖల ఉన్నతాధికారులు హాజరుకానున్నారు.
News November 29, 2024
ముఖ్యమంత్రి చంద్రబాబు నేటి షెడ్యూల్ ఇదే.!
ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం షెడ్యూల్‌ను అధికారులు విడుదల చేశారు. ఉదయం 11.15 గంటలకు నారావారిపల్లె నుంచి సచివాలయానికి చేరుకుంటారు. మధ్యాహ్నం 12 గంటలకు స్వర్ణాంధ్ర విజన్ 2047 లక్ష్యాల సాధనపై తదుపరి కార్యాచరణపై చర్చిస్తారు. 3.30 గంటలకు రెవెన్యూ శాఖపై సమీక్ష చేసిన అనంతరం గ్రామ/వార్డు సచివాలయాల పునర్ వ్యవస్థీకరణపై సమీక్ష చేయనున్నట్లు చెప్పారు.