News July 18, 2024
అర్చకుల బదిలీని నిలిపి వేస్తూ హైకోర్టు స్టే

భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో పనిచేస్తున్న అర్చకుల బదిలీని నిలిపి వేస్తూ హైకోర్టు స్టే ఇచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా ఆలయ అర్చకులను బదిలీ చేయాలని దేవాదాయ శాఖ జీవో విడుదల చేసిన నేపథ్యంలో భద్రాచలానికి చెందిన ఆలయ ఉప ప్రధానార్చకులు మురళీ కృష్ణమాచార్యులు, శ్రీమన్నారాయణ చార్యులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీంతో భద్రాద్రి ఆలయ అర్చకుల బదిలీని నిలిపివేస్తూ న్యాయస్థానం స్టే ఇచ్చింది.
Similar News
News January 22, 2026
రైతులకు ఊరట.. జిల్లాకు భారీగా యూరియా

సాగువేళ రైతులకు ఎరువుల కొరత లేకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. బుధవారం చింతకాని పందిళ్లపల్లి రేక్ పాయింట్‌కు 505.35మెట్రిక్ టన్నుల యూరియా చేరుకుంది. ఈ నిల్వలను పూర్తిగా ఖమ్మం జిల్లాకే కేటాయించినట్లు ఏఓ (టెక్నికల్) పవన్‌కుమార్ తెలిపారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, ప్రైవేటు డీలర్లకు తరలించినట్లు పేర్కొన్నారు. ఎరువుల సరఫరాలో ఇబ్బందులు లేకుండా నిరంతరం పర్యవేక్షిస్తున్నామని స్పష్టం చేశారు.
News January 22, 2026
ఖమ్మం: ఎన్నికల నగారా.. మున్సిపాలిటీలపై కలెక్టర్ స్పెషల్ ఫోకస్!

ఖమ్మం జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో ఎన్నికల నిర్వహణకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్ పి.శ్రీజతో కలిసి మున్సిపల్ కమిషనర్లతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఎదులాపురం, వైరా, మధిర, కల్లూరు, సత్తుపల్లిలలో ఓటర్ల జాబితా సిద్ధం చేయడం, పోలింగ్ కేంద్రాల తనిఖీ వంటి అంశాలపై దిశానిర్దేశం చేశారు.