News July 18, 2024
డీఎస్సీ అభ్యర్థులకు గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నేటి నుంచి డీఎస్సీ పరీక్షలు ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఖమ్మం జిల్లాలో డీఈఓ సోమశేఖరశర్మ, భద్రాద్రి కొత్తగూడెంలో డీఈఓ వెంకటేశ్వరాచారి పర్యవేక్షణలో పరీక్షలు జరగనున్నాయి. ఈ క్రమంలో అభ్యర్థులకు ఏవైనా సందేహాలు ఉంటే నివృత్తి చేసుకునేందుకు డీఈఓ కార్యాలయాల్లో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేశారు. ఖమ్మం 99512 12603, భద్రాద్రి జిల్లా అభ్యర్థులు 98857 57137కు సంప్రదించాలన్నారు.
Similar News
News September 1, 2025
మహిళా అభ్యున్నతికి కృషి చేయండి: అదనపు కలెక్టర్

మహిళల అభ్యున్నతికి ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకోవాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శ్రీజ అధికారులను ఆదేశించారు. సోమవారం ఆమె ఇందిరా మహిళా శక్తిపై సమీక్ష నిర్వహించారు. తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ, కొత్త స్వశక్తి సంఘాల ఏర్పాటు, బ్యాంకు లింకేజీ రుణాలు, ఏకరూప దుస్తుల కుట్టు పనులు, ఎర్రుపాలెం, కల్లూరులో సోలార్ ప్యానెల్స్, పెట్రోల్ బంక్ ఏర్పాటు వంటి అంశాలపై మండలాల వారీగా సమీక్షించారు.
News September 1, 2025
ప్రజావాణి దరఖాస్తులను పరిష్కరించాలి: అదనపు కలెక్టర్లు

ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్లు శ్రీజ, శ్రీనివాస రెడ్డి అధికారులకు సూచించారు. సోమవారం జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. విద్యార్థిని సీటు, రహదారి సమస్యలు, ఇందిరమ్మ ఇళ్లు, వెలుగుమట్ల చెరువు ఆక్రమణ వంటి సమస్యలపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
News August 31, 2025
ఖమ్మం: స్థానిక పోరుకు సమాయత్తం

ఖమ్మం జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల సందడి మొదలుకానుంది. అధికారులు ఇప్పటికే ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. జిల్లాలో 571 పంచాయతీల్లో 5,214 వార్డులు, అదే సంఖ్యలో పోలింగ్ స్టేషన్‌లు ఉన్నాయి. ప్రస్తుతం 3,146 బ్యాలెట్ బాక్సులు అందుబాటులో ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. ఇక జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు 1,572 బ్యాలెట్ బాక్స్‌లు సిద్ధం చేశారు. ఎన్నికల నిర్వహణకు 10,330 మంది అవసరమని తేల్చారు.