News July 18, 2024

రీల్స్ చేస్తూ లోయలో పడి యువతి మృతి

image

ముంబైకి చెందిన ట్రావెల్ ఇన్‌ఫ్లూయెన్సర్ అన్వీ కామ్‌దార్(26) స్నేహితులతో రాయ్‌గడలోని కుంభే జలపాతానికి వెళ్లారు. అక్కడ రీల్స్ చేసేందుకు లోయ అంచున నిలబడగా కాలు జారి 300 అడుగుల లోయలో పడిపోయారు. సమాచారం అందుకున్న పోలీసు, ఫైర్ సిబ్బంది 6 గంటలు కష్టపడి అన్వీని కాపాడారు. కానీ తీవ్రగాయాలు కావడంతో ఆసుపత్రిలో చేర్చిన కాసేపటికే ఆమె మరణించారు. అన్వీకి సోషల్ మీడియాలో 2లక్షలకు పైగా ఫాలోవర్లు ఉన్నారు.

Similar News

News January 23, 2026

విచారణలో రాధాకిషన్ ఎంట్రీ..? KTR రిప్లై ఇదే!

image

TG: ఫోన్ ట్యాపింగ్‌పై తనను విచారించే సమయంలో మాజీ DCP రాధాకిషన్‌ రావును పిలిపించారనేది అవాస్తవమని KTR స్పష్టం చేశారు. ‘అక్కడ తారకరామారావు తప్ప మరే రావు లేడు. ప్రభుత్వం కుట్రతో ఇచ్చే ఇలాంటి లీకులను మీడియా వెరిఫై చేయకుండా ప్రజలకు చెప్పవద్దు’ అని కోరారు. కాగా SIT ప్రశ్నలకు సమాధానాలు దాటవేస్తూ అంతా అధికారులే చూసుకున్నారని KTR చెప్పడంతో రాధాకిషన్‌ను రప్పించి ఎదురెదురుగా విచారించారని ప్రచారం జరిగింది.

News January 23, 2026

‘హంద్రీనీవా’కు 40TMCల నీరు…CMకు థాంక్స్

image

AP: హంద్రీనీవా విస్తరణకు కృషిచేసి రాయలసీమకు నీళ్లందించారని CM CBNకు
మంత్రులు కేశవ్, జనార్దన్, MLA కాల్వ శ్రీనివాస్ కృతజ్ఞతలు తెలిపారు. 190 రోజుల్లో 40 TMCల నీటిని విడుదల చేసి రికార్డు సృష్టించినట్లు చెప్పారు. 2014-19 మధ్య 6 పంపులుండగా ఇపుడు 100 రోజుల్లో 12 పంపుల సామర్థ్యానికి పెంచడంతో ఇది సాధ్యమైందన్నారు. కాగా మార్చి నాటికి 50 TMCలు విడుదల చేసేలా చర్యలు తీసుకోవాలని మంత్రి నిమ్మలకు CM సూచించారు.

News January 23, 2026

పూర్తిగా సహకరించా: KTR

image

TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసుల విచారణకు పూర్తిగా సహకరించానని మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. అన్ని ప్రశ్నలకు సమాధానం ఇచ్చానని చెప్పారు. తెలంగాణ భవన్‌లో మీడియాతో ఆయన మాట్లాడారు. ‘రెండేళ్ల విచారణలో లీకులు ఎందుకు ఇస్తున్నారని సిట్ అధికారులను సూటిగా ప్రశ్నించా. పార్టీ నేతలపై వ్యక్తిత్వ హననానికి ఎవరు బాధ్యులని అడిగా’ అని తెలిపారు. ప్రజల దృష్టిని మరల్చేందుకే ప్రభుత్వం ఈ డ్రామాలు ఆడుతోందని మండిపడ్డారు.