News July 18, 2024

పర్వతగిరి: బాలిక మృతిపై కీలక UPDATE

image

పర్వతగిరి మండలంలో బాలిక అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన విషయం తెలిసిందే. SI వెంకన్న వివరాలు.. ఇంటర్ చదువుతున్న G.ఐశ్వర్య(16) కాలేజీకి వెళ్లి మధ్యాహ్నం ఇంట్లో అనుమానాస్పదంగా మృతి చెందగా.. అందుకు M.ఛత్రపతి అనే వ్యక్తి కారణమని ఆమె తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె మెడకు ఉరేసుకున్నట్లు, మృతదేహం పక్కన చీర పడి ఉంది. ఛత్రపతికి ఐశ్వర్యకు ఇటీవల ఎంగేజ్మెంట్ అయిందని SI తెలిపారు.

Similar News

News August 28, 2025

WGL: గణేష్ నిమజ్జన ప్రదేశాలను పరిశీలించిన సీపీ

image

హనుమకొండ జిల్లాలోని వచ్చే నెల 5న నిర్వహించనున్న గణేశ్ నిమజ్జన ఏర్పాట్లను వరంగల్ సీపీ సన్‌ప్రీత్ సింగ్ పరిశీలించారు. హనుమకొండలోని కాజీపేట బంధం చెరువు, సిద్ధేశ్వర గుండం, హసన్‌పర్తి చెరువులను ఆయన సందర్శించి, నిమజ్జన ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు. ఆయనతో పాటు సెంట్రల్ జోన్ డీసీపీ షేక్ సలీమా, అదనపు డీసీపీ ప్రభాకర్ రావు, స్పెషల్ బ్రాంచ్ ట్రాఫిక్ ఏసీపీలు తదితరులు పాల్గొన్నారు.

News August 28, 2025

మూడు రోజులుగా ముసురు.. అయినా సాధారణ వర్షపాతమే..!

image

వరంగల్ జిల్లా వ్యాప్తంగా మూడు రోజులుగా ముసురు పడుతూనే ఉంది. ఈ వానతో వాతావరణం పూర్తిగా చల్లబడింది. అయితే మూడు రోజులుగా సాధారణ వర్షపాతమే నమోదు అవుతోంది. ఎక్కడా భారీ వర్షాలు నమోదు కాలేదు. గీసుగొండ, దుగ్గొండి, నెక్కొండ, పర్వతగిరి, రాయపర్తి, నర్సంపేట, ఖానాపూర్, నల్లబెల్లి, చెన్నరావుపేట, సంగెం, వర్ధన్నపేట తదితర మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదు కాగా వరంగల్, ఖిలావరంగల్‌లో తక్కువే పడింది.

News August 27, 2025

వరంగల్ జిల్లాలో దంచి కొడుతున్న వర్షం

image

వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉదయం నుంచి వర్షం దంచి కొడుతోం. ఆగస్టు 27న ఉ.8:30 నుంచి సా.4 వరకు 107.1 మి.మీ. వర్షపాతం నమోదైంది. నల్లబెల్లి మండలంలో అత్యధికంగా 30.5 మి.మీ. వర్షం కురిసింది. దుగ్గొండి 23.8, ఖానాపూర్ 15.3 నమోదైంది. అతి తక్కువగా ఖిల్లా వరంగల్ మండలంలో 0.5 మి.మీ. నమోదైంది.