News July 18, 2024
‘ఇంజినీరింగ్’ కనీస ఫీజు రూ.43వేలు
AP: ఇంజినీరింగ్ కాలేజీల్లో కనీస ఫీజును ప్రభుత్వం రూ.43 వేలకు పెంచింది. రూ.45వేలు ఇవ్వాలని యాజమాన్యాలు కోరగా, రూ.43 వేలు ఇచ్చేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గత ప్రభుత్వం ఫీజులు తగ్గించడంతో యాజమాన్యాలు కోర్టును ఆశ్రయించగా, 2023 జూన్‌లో ఉన్నత విద్య నియంత్రణ పర్యవేక్షణ కమిటీ సిఫారసు చేసిన ఫీజులను అమలు చేయాలని ధర్మాసనం ఆదేశించింది. ఈ నేపథ్యంలో చర్చల అనంతరం కనీస ఫీజు రూ.43వేలుగా ఖరారైంది.
Similar News
News January 22, 2025
డిపోల ప్రైవేటీకరణ అవాస్తవం: TGSRTC
ఎలక్ట్రిక్ బస్సుల పేరిట ఆర్టీసీ డిపోల ప్రైవేటీకరణ ప్రయత్నాలంటూ జరుగుతున్న ప్రచారాన్ని TGSRTC ఖండించింది. ఎలక్ట్రిక్ బస్సుల మెయిన్‌టనెన్స్, ఛార్జింగ్ మినహా ఆపరేషన్స్ అంతా TGSRTC ఆధ్వర్యంలోనే జరుగుతుందని స్పష్టం చేసింది. కేంద్ర ప్రభుత్వ ఈవీ పాలసీ ప్రకారమే ఎలక్ట్రిక్ బస్సుల్ని తీసుకొస్తున్నామని, ఈ ఏడాది మేలో మరిన్ని బస్సులు అందుబాటులోకి వస్తాయని ఓ ప్రకటనలో తెలిపింది.
News January 22, 2025
INDvsENG టీ20ల్లో మోస్ట్ రన్స్, వికెట్స్ వీరివే
☛ మోస్ట్ రన్స్: విరాట్ కోహ్లీ – 648 (38.11 avg), జోస్ బట్లర్ – 498 (33.20), రోహిత్ శర్మ – 467 (35.92), జాసన్ రాయ్ – 356 (23.73), ఇయాన్ మోర్గాన్ – 347 (26.69)
☛ మోస్ట్ వికెట్స్: జోర్డాన్ (24), చాహల్ (16), హార్దిక్ (14), బుమ్రా (9), భువనేశ్వర్ (9).
News January 22, 2025
‘గేమ్ ఛేంజర్’ ఓటీటీ విడుదల ఫిక్స్?
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ తెరకెక్కించిన ‘గేమ్ ఛేంజర్’ సినిమా ఓటీటీలో విడుదలకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ చిత్రం ఈనెల 10న ప్రపంచవ్యాప్తంగా విడుదలవగా 5 వారాలు పూర్తయ్యాక ఓటీటీలో రిలీజ్ కానున్నట్లు సినీవర్గాలు తెలిపాయి. ఫిబ్రవరి 14వ తేదీన స్ట్రీమింగ్‌కు వస్తుందని అంచనా వేశాయి. ఈ చిత్ర ఓటీటీ హక్కులను ‘అమెజాన్ ప్రైమ్’ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.