News July 18, 2024

నిర్మల్: కొడుకు మరణాన్ని తట్టుకోలేక తల్లి మృతి

image

కుమారుడు మృతి చెందడంతో గుండెపోటుతో తల్లి మృతి చెందిన ఘటన లక్ష్మణ్‌చందా మండలంలో చోటుచేసుకుంది. రాచాపూర్ గ్రామానికి చెందిన బక్కన్న, ఎర్రవ్వలకు ఓ కుమారుడు, ముగ్గరు కుమార్తెలు. కుమారుడు సాయన్న(40) అనారోగ్యంతో చికిత్స పొందుతూ ఈనెల 13న మృతి చెందాడు. దీంతో మనోవేదనకు గురైన అతడి తల్లికి గుండెపోటు వచ్చింది. కుటుంబీకులు ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే ఆమె మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు.

Similar News

News August 28, 2025

సీఐ ని పరామర్శించిన ఎమ్మెల్యే శంకర్

image

జైనథ్ సీఐ సాయినాథ్‌ను ఎమ్మెల్యే పాయల్ శంకర్ పరామర్శించారు. డొలారా జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ సీఐ ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయాన్ని తెలుసుకున్న ఎమ్మెల్యే గురువారం ఆస్పత్రికి వెళ్లి సీఐ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. దగ్గరుండి పలు వైద్య పరీక్షలను చేయించారు. సీఐతో పాటు గాయపడ్డ డ్రైవర్ ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు.

News August 28, 2025

సీఐ, డ్రైవర్ పరిస్థితిపై ఎస్పీ అరా

image

ఆదిలాబాద్ జిల్లా ఉమ్మడి జైనథ్ మండలంలోని డొలారా జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ జైనథ్ సీఐ సాయినాథ్, డ్రైవర్ పరిస్థితిపై జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆరా తీశారు. ప్రమాదం జరిగిన విషయాన్ని తెలుసుకున్న వెంటనే ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సీఐ, డ్రైవర్‌ను ఎస్పీ స్వయంగా వెళ్లి పరామర్శించారు. డాక్టర్‌తో మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితి పై ఆరా తీశారు. డీఎస్పీ జీవన్ రెడ్డి ఉన్నారు.

News August 28, 2025

కొత్తపల్లిని రెవెన్యూ గ్రామంగా మారుస్తా: MP

image

నార్నూర్ మండలంలోని కొత్తపల్లి(H) గ్రామంగా మార్చుటకు కృషి చేస్తామని ఎంపీ గోడం నగేష్ హమిచ్చారు. గురువారం ఆదిలాబాదులోని ఆయన నివాసంలో గ్రామస్థులు ఎంపీను మర్యాదపూర్వకంగా కలిశారు. కొత్తపల్లి గ్రామంలో ఉన్న శ్రీహనుమాన్ ఆలయానికి ప్రహరీ కోసం రూ.5 లక్షలు మంజూరు చేశారు. కార్యక్రమంలో చౌహన్ దిగంబర్, గుణవంతరావు, శ్యామరావు, కేశవ్, దీపక్, ప్రవీణ్ నాయక్ తదితరులున్నారు.