News July 18, 2024
తక్షణమే కాల్పుల విరమణ చేపట్టండి: హమాస్, ఇజ్రాయెల్‌కు భారత్ పిలుపు

గాజాలో తక్షణమే కాల్పుల విరమణ చేపట్టాలని హమాస్, ఇజ్రాయెల్‌కు భారత్ పిలుపునిచ్చింది. బేషరతుగా బందీలను విడుదల చేయాలని ఐక్యరాజ్యసమితి వేదికగా హమాస్‌ను డిమాండ్ చేసింది. గాజా స్ట్రిప్‌లో వెంటనే మానవతా సేవలు కొనసాగించాలని పేర్కొంది. అలాగే హమాస్-ఇజ్రాయెల్ యుద్ధాన్ని ఆపేందుకు ప్రయత్నించిన ఈజిప్ట్, ఖతర్ దేశాలను భారత్ అభినందించింది.
Similar News
News February 1, 2026
ఏపీ ముఖ్యమైన కేటాయింపులు ఇలా..

* అమరావతి రాజధాని అభివృద్ధి(ఏడీబీ నిధులు)- రూ.1,128 కోట్లు
* అమరావతి ఇంటిగ్రేటెడ్ అర్బన్ డెవలప్‌మెంట్(జపాన్ నిధులు)- రూ.432 కోట్లు
* గ్రామీణ రహదారులు- రూ.500 కోట్లు
* పట్టణాల్లో తాగు, మురుగు నీటి పారుదల- రూ.800 కోట్లు
* ప్రకృతి వ్యవసాయం- రూ.155 కోట్లు
* రోడ్లు, వంతెనల పునర్నిర్మాణం- రూ.350 కోట్లు
News February 1, 2026
NIMHRలో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

మధ్యప్రదేశ్ సెహోర్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ రిహాబిలిటేషన్ (<
News February 1, 2026
‘లిట్టర్’ నిర్వహణ.. కోళ్ల ఫారాల్లో ముఖ్యం

కోళ్ల ఫారాలలో నేలపై ఎండు గడ్డి, చెక్క పొట్టు, లేదా ఇతర సేంద్రియ పదార్థాల రూపంలో లిట్టర్ ఉంటుంది. దీన్ని కోళ్ల ఫారాలలో పరుపుగా ఉపయోగిస్తారు. ఇది కేవలం కోళ్ల పడక పదార్థమే కాదు. కోళ్ల మల విసర్జనలోని తేమను పీల్చి పొడిగా ఉంచుతుంది. ఫారాల్లో దుర్వాసనను తగ్గిస్తుంది. కోళ్లకు సౌకర్యంగా ఉండేట్లు చేసి.. వ్యాధికారక క్రిములు పెరగకుండా చేస్తుంది. లిట్టర్ నిర్వహణ సరిగాలేకుంటే వ్యాధుల ఉద్ధృతి పెరుగుతుంది.


