News July 18, 2024
శ్రీలంకతో సిరీస్‌కు నేడు భారత జట్టు ప్రకటన!

శ్రీలంకతో T20, వన్డే సిరీస్ కోసం భారత జట్టును BCCI ఇవాళ ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. ఈ సిరీస్‌లో రోహిత్ శర్మ ఆడే ఛాన్స్ ఉంది. హార్దిక్, బుమ్రా, కోహ్లీలకు రెస్ట్ ఇవ్వనున్నట్లు సమాచారం. అలాగే T20లకు సూర్యకుమార్ యాదవ్‌ను కెప్టెన్‌గా నియమించనున్నట్లు టాక్. ఈ నెల 27న తొలి T20, 28న రెండో మ్యాచ్, 30న మూడో T20 జరగనుంది. ఆగస్టు 2న తొలి వన్డే, 4న రెండో మ్యాచ్, 7న చివరి వన్డే జరగనుంది.
Similar News
News November 6, 2025
మినుము పంటలో విత్తన శుద్ధితో అధిక దిగుబడి

మినుము పంటలో తెగుళ్ల కట్టడికి విత్తనశుద్ధి కీలకం. దీని కోసం కిలో విత్తనానికి 2.5 గ్రాముల కాప్టాన్ (లేదా) థైరాన్ (లేదా) మాంకోజెబ్‌లతో విత్తనశుద్ధి చేయాలి. తర్వాత కిలో విత్తనానికి 5ml ఇమిడాక్లోప్రిడ్ 600 FS మందును కలిపి నీడలో ఆరనివ్వాలి. విత్తడానికి గంట ముందుగా కిలో విత్తనానికి 20గ్రా రైజోబియం కల్చరును కలిపినట్లైతే, నత్రజని బాగా అందుబాటులో ఉండటం వల్ల, అధిక పంట దిగుబడిని పొందవచ్చు.
News November 6, 2025
ప్రభుత్వ స్కూళ్లలో 2,837 ఉద్యోగాలు!

తెలంగాణలోని ప్రభుత్వ స్కూళ్లలో 2,837 కంప్యూటర్ టీచర్లను (ఐసీటీ ఇన్‌స్ట్రక్టర్లు) నియమించనున్నారు. విద్యార్థులకు ఐటీలో శిక్షణ ఇవ్వడానికి ఔట్ సోర్సింగ్ విధానంలో టీచర్లను భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. తెలంగాణ టెక్నాలజీ సర్వీసెస్ ద్వారా ఈ నియామక ప్రక్రియ చేపట్టనున్నారు. నెలకు గౌరవ వేతనంగా రూ.15వేలు చెల్లించనున్నారు. త్వరలో నోటిఫికేషన్ విడుదల చేసి అర్హుల నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు.
News November 6, 2025
ఇతిహాసాలు క్విజ్ – 58 సమాధానాలు

1. ధృతరాష్ట్రుడి రథసారథి ‘సంజయుడు’.
2. కంసుడి తండ్రి ‘ఉగ్రసేనుడు’.
3. శశాంకుడు అంటే ‘చంద్రుడు’.
4. విశ్వకర్మ పుత్రిక ‘సంజ్ఞ’.
5. తెలుగు సంవత్సరాలు ‘60’.
<<-se>>#Ithihasaluquiz<<>>


