News July 18, 2024

BREAKING: తెరుచుకున్న పూరీ రహస్య గది

image

ఒడిశాలోని పూరీ రత్న భాండాగారంలోని రహస్య గదిని అధికారులు తెరిచారు. ఆలయంలోని సంపదను స్ట్రాంగ్ రూమ్‌కు తరలించనున్నారు. ఇప్పటికే రెండు గదుల్లోని సంపదను తరలించారు. ఈ నెల 14న రహస్య గదిని తెరిచినా అప్పటికే సాయంత్రం కావడంతో సీల్ వేశారు. ఈ క్రమంలో ఆలయంలోకి భక్తుల ప్రవేశాన్ని నిలిపివేశారు. రహస్య గదిలో దిగువన సొరంగ మార్గం ఉందా? లేదా? అనే దానిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

Similar News

News November 9, 2025

ఒలింపిక్స్ 2028: IND vs PAK మ్యాచ్ లేనట్లే!

image

2028 నుంచి ఒలింపిక్స్‌లో క్రికెట్ భాగం కానున్న సంగతి తెలిసిందే. అయితే మెగా టోర్నీలు అనగానే భారత్, పాకిస్థాన్ మ్యాచ్ ఉండాల్సిందే. కానీ ఈ ఈవెంట్‌లో ఇరు జట్లు తలపడే అవకాశాలు లేనట్లు తెలుస్తోంది. పాకిస్థాన్‌కు ఒలింపిక్స్‌లో చోటు దక్కడం కష్టంగా మారడమే దీనికి కారణం. ఒక్కో ఖండం నుంచి ఒక్కో <<18233382>>జట్టును<<>> ఎంపిక చేయాలని ఐసీసీ ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. దీనిపై త్వరలోనే క్లారిటీ రానుంది.

News November 9, 2025

కొలికపూడిపై చర్యలు తీసుకోవాలి.. CBNకు పార్టీ క్రమశిక్షణ కమిటీ నివేదిక

image

AP: ఎంపీ చిన్నితో వివాదంలో తప్పంతా MLA కొలికపూడిదేనంటూ TDP క్రమశిక్షణ కమిటీ సీఎం చంద్రబాబుకు నివేదిక ఇచ్చింది. ఎన్నికైనప్పటి నుంచి పార్టీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారని పేర్కొంది. తన ఆరోపణలపై కొలికపూడి ఒక్క ఆధారం సమర్పించలేదని, సస్పెన్షన్ లేదా అధికారాలు తీసేయాలని సీఎంకు విన్నవించినట్లు సమాచారం. అయితే వారిద్దరినీ పిలిచి మాట్లాడి నిర్ణయం తీసుకుంటానని కమిటీకి CBN చెప్పారు.

News November 9, 2025

పాడి పశువుల పాలలో కొవ్వు శాతం ఎందుకు తగ్గుతుంది?

image

గేదె, ఆవు పాలకు మంచి ధర రావాలంటే వాటిలో కొవ్వు శాతం కీలకం. పశువుల వయసు ఎక్కువగా ఉన్నప్పుడు, ఈత చివరి దశలో సాధారణంగానే పాలలో కొవ్వు శాతం తగ్గుతుంది. పశువులను మరీ ఎక్కువ దూరం నడిపించినా, అవి ఎదలో ఉన్నా, వ్యాధులకు గురైనా, మేతను మార్చినప్పుడు, పచ్చి, ఎండుగడ్డిని సమానంగా ఇవ్వకున్నా పాలలో వెన్నశాతం అనుకున్నంత రాదు.✍️ వెన్నశాతం పెంచే సూచనలకు <<-se_10015>>పాడిపంట <<>>క్లిక్ చేయండి.