News July 18, 2024

నిజామాబాద్ జిల్లాలో మూడు రోజులు భారీ వర్షాలు

image

నిజామాబాద్ జిల్లాలో గురువారం, శుక్రవారం, శనివారం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. 11.5 నుంచి 20 సెం.మీ వరకు వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నట్లు పేర్కొన్నారు. కాగా శనివారం కామారెడ్డి జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.

Similar News

News August 27, 2025

SRSP UPDATE: 39 గేట్లు ఓపెన్

image

కురుస్తున్న వర్షాలతో SRSPకి వరద నీరు పోటెత్తడంతో బుధవారం రాత్రి 8 గంటలకు మొత్తం 39 వరద గేట్లను అధికారులు ఓపెన్ చేశారు. ఉదయం 10 గంటలకు 8 గేట్లు, మధ్యాహ్నం 12 గంటలకు మరో 9 గేట్లు ఓపెన్ చేసిన సంగతి తెలిసిందే. కాగా 39 గేట్లు, ఇతర కాలువల ద్వారా మొత్తం 1,71,048 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు.

News August 27, 2025

NZB: కంట్రోల్ రూమ్ ద్వారా పరిస్థితిని సమీక్షించిన కలెక్టర్

image

వర్షాల వల్ల జిల్లాలో నెలకొని ఉన్న పరిస్థితులను నిజామాబాద్ కలెక్టర్ వినయ్ కృష్ణా రెడ్డి బుధవారం సాయంత్రం కంట్రోల్ రూమ్ ద్వారా సమీక్షించారు. కలెక్టరేట్‌లో ఉన్న కంట్రోల్ రూమ్‌ను కలెక్టర్ సందర్శించారు. వరద ప్రభావిత ప్రాంతాల నుంచి ఏమైనా ఇబ్బందులు ఏర్పడినట్లు సమాచరం అందిన వెంటనే అధికారులను అప్రమత్తం చేయాలని కంట్రోల్ రూమ్ సిబ్బందికి సూచించారు. జిల్లాలో పరిస్థితి పూర్తిగా అదుపులోనే ఉందన్నారు.

News August 27, 2025

భారీ వర్షాలు.. బయటకు రాకండి: NZB కలెక్టర్

image

భారీ వర్షాలు కురుస్తున్నందున శ్రీరాంసాగర్ పరీవాహక ప్రాంతం, నదులు, వాగులు, జలాశయాల పరిసర ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. భారీ వర్షాలతో రాకపోకలకు ఇబ్బందులు తలెత్తి, ప్రమాదాల బారిన పడే అవకాశం ఉందని, అవసరం అయితే తప్ప ప్రయాణాలు చేయవద్దన్నారు. చేపలవేట, ఈత సరదా కోసం చెరువులు, కాలువలు, కుంటలు, ఇతర జలాశయాల వద్దకు వెళ్లవద్దన్నారు.