News July 18, 2024

HYD: రక్తం మరిగిన కుక్కలు.. కారణం ఇదేనా?

image

గ్రేటర్ HYDలో కుక్కలు రక్తం మరిగాయి. నిత్యం <<13652139>>కుక్క కాటు కేసులు<<>> నమోదవుతూనే ఉన్నాయి. కాగా రాజధాని పరిధిలో కొందరు చికెన్, మటన్ షాపుల నిర్వాహకులు మాంసపు వ్యర్థాలను కుక్కలకు వేయడంతో అవి నాన్ వెజ్‌ తినేందుకు బాగా అలవాటు పడుతున్నాయని సోషల్ మీడియాలో నెటిజన్లు పేర్కొంటున్నారు. మాంసానికి అలవాటు పడి పిల్లలపై దాడి చేస్తున్నాయని అంటున్నారు. అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. దీనిపై మీ కామెంట్?

Similar News

News August 27, 2025

ఐఐటీ HYDతో మిలిటరీ అధికారుల ఒప్పందం

image

ఐఐటీ హైదరాబాద్, సికింద్రాబాద్‌లోని సిమ్యులేటర్ డెవలప్‌మెంట్ డివిజన్ మధ్య ఒప్పందం కుదిరింది. దీని ద్వారా సికింద్రాబాద్‌లో ఏఆర్‌/వీఆర్‌ టెక్నాలజీ నిపుణుల కేంద్రం ఏర్పాటు కానుంది. ఈ భాగస్వామ్యం లక్ష్యం.. ఆధునిక పరిశోధనలను సైనిక అవసరాలకు అనుగుణంగా మార్చి, సైనికులకు అధునాతన శిక్షణను అందించే సాంకేతికతను అభివృద్ధి చేయడం. భవిష్యత్ మిలిటరీ సామర్థ్యాలను మెరుగుపరచడానికి ఈ కేంద్రం ఉపయోగపడుతుందని తెలిపారు

News August 27, 2025

వర్షాలపై మంత్రి పొన్నం ప్రభాకర్ సూచన

image

రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. కామారెడ్డి, మెదక్ జిల్లాల్లో భారీ వర్షాలకు అలుగులు పొంగుతున్నాయి. ఆర్టీసీ డ్రైవర్లు అప్రమత్తంగా ఉండాలని కోరారు. హైదరాబాద్‌లోని నీరు నిలిచే ప్రాంతాల వద్ద జీహెచ్‌ఎంసీ సిబ్బంది ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

News August 27, 2025

శంకర్‌పల్లి మీదుగా తిరుపతి రైలు రద్దు

image

నిజామాబాద్ నుంచి శంకర్‌పల్లి మీదుగా తిరుపతికి వెళ్లే రాయలసీమ ఎక్స్‌ప్రెస్ రైలు బుధవారం రద్దయింది. భారీ వర్షాల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు దక్షిణ మధ్య రైల్వే పేర్కొంది. వికారాబాద్, తాండూర్, మంత్రాలయం, గుంతకల్లు, కడపకు వెళ్లే ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించగలరని రైల్వే అధికారులు కోరారు.