News July 18, 2024
ఇన్సాల్వెన్సీ ఆర్డర్‌పై NLCATని ఆశ్రయించిన బైజూస్
NCLT విధించిన ఇన్సాల్వెన్సీ ఆర్డర్‌ను సవాల్ చేస్తూ బైజూస్ నేషనల్ కంపెనీ లా అప్పీలేట్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించింది. ట్రిబ్యునల్ ఈనెల 22న విచారణను చేపట్టే అవకాశం ఉంది. ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేవని, నెల రోజుల్లో ఒకే విడతలో బీసీసీఐకి ₹158కోట్ల బాకీని చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నామని బైజూస్ తెలిపింది. కాగా NCLT ఇన్సాల్వెన్సీ ఆర్డర్‌తో బైజూస్ సీఈఓ రవీంద్రన్ తన అధికారాన్ని కోల్పోయారు.
Similar News
News December 27, 2024
TODAY HEADLINES
* మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కన్నుమూత
* ఏపీలో ఈ నెల 31న పింఛన్ల పంపిణీ
* పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా?: సీఎం రేవంత్
* మస్కట్ బాధితురాలికి అండగా నారా లోకేశ్
* తెలంగాణ విద్యార్థులకు 11 రోజులు సెలవులు
* మహిళా కానిస్టేబుల్, ఎస్సై, కంప్యూటర్ ఆపరేటర్ ఆత్మహత్య?
* మహారాష్ట్ర ఎన్నికల్లో రిగ్గింగ్: రాహుల్ గాంధీ
* ప్రముఖ రచయిత, డైరెక్టర్ వాసుదేవన్ కన్నుమూత
* రూ.1,700 కోట్లు దాటిన ‘పుష్ప 2’ కలెక్షన్లు
News December 27, 2024
నా మార్గదర్శిని కోల్పోయా: రాహుల్ గాంధీ
అపార జ్ఞానం, సమగ్రతతో మన్మోహన్ సింగ్ దేశాన్ని ముందుకు నడిపించారని లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కొనియాడారు. తన గురువు, మార్గదర్శిని కోల్పోయానన్నారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఆర్థిక శాస్త్రంలో మన్మోహన్‌కు ఉన్న లోతైన అవగాహన దేశానికి ఓ స్ఫూర్తి అని పేర్కొన్నారు. రాజకీయాల్లో ఆయన నిజాయితీ మనకు ఎప్పుడూ స్ఫూర్తిదాయకమని ఎంపీ ప్రియాంకా గాంధీ చెప్పారు.
News December 27, 2024
మన్మోహన్‌ను దేశం ఎప్పటికీ గుర్తుంచుకుంటుంది: రాష్ట్రపతి
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి అందరికీ తీరని లోటు అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. దేశ ఆర్థిక సంస్కరణల్లో ఆయన కీలక పాత్ర పోషించారని కొనియాడారు. మన్మోహన్‌ను దేశం ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటుందని పేర్కొన్నారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. మన్మోహన్ ఇక లేరన్న విషయం బాధకు గురిచేసిందని ఉప రాష్ట్రపతి జగ్‌దీప్ ధన్‌ఖడ్ అన్నారు. దేశం ఒక మహోన్నత వ్యక్తికి కోల్పోయిందని చెప్పారు.