News July 18, 2024
రైతులకు ఇచ్చిన మాటను నెరవేరుస్తున్నాం: కొండా సురేఖ

WGL: ఎన్నికల సమయంలో రైతులకు ఇచ్చిన మాటను నెరవేరుస్తున్నామని రాష్ట్ర దేవాదాయ మంత్రి కొండా సురేఖ అన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తోందన్నారు. రైతు రుణమాఫీ చారిత్రాత్మక నిర్ణయమని, రాష్ట్రంలోని రైతుల తరఫున సీఎంకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని మంత్రి కొండా సురేఖ ట్వీట్ చేశారు.
Similar News
News August 27, 2025
వరంగల్ జిల్లాలో భగ్గుమంటున్న ధరలు

జిల్లా వ్యాప్తంగా పూలు, పండ్లు, కొబ్బరికాయలు, ఇతర పూజ సామగ్రి ధరలు అమాంతం పెరిగిపోయాయి. నేడు వినాయక చవితి పర్వదినం సందర్భంగా చామంతి పూలు కేజీ రూ.450, బంతిపూలు కిలో రూ.150 నుంచి రూ.200, మూర పూలు రూ.50కి విక్రయిస్తున్నారు. అలాగే డజను అరటి పండ్లు రూ.70-100 ధర పలుకుతున్నాయి. కొబ్బరికాయలు సైతం ఒకటి రూ.35-40 ధర ఉంది.
News August 27, 2025
వరంగల్: 4 రోజుల్లో రేషన్ పునః ప్రారంభం..!

పేద ప్రజలకు చౌక రేషన్ దుకాణాల ద్వారా పంపిణీ చేసే బియ్యం సెప్టెంబర్ నుంచి తిరిగి పున:ప్రారంభం కానున్నాయి. కేంద్ర ప్రభుత్వం మూడు నెలల పాటు ఒకేసారి బియ్యం పంపిణీ చేయగా ఆ గడువు పూర్తవుతోంది. జిల్లాలో 509 రేషన్ దుకాణాలు ఉండగా, పాత కార్డులు 2,66,429, కొత్త కార్డులు 16,251 ఉన్నాయి. ఏనుమాముల, నర్సంపేట, వర్ధన్నపేటలో ఎంఎల్ఎస్ పాయింట్లు ఉన్నాయి. పంపిణీ చేయాల్సిన బియ్యం 5,382,518 మెట్రిక్ టన్నులు.
News August 26, 2025
ఎంజీఎం ఆసుపత్రిలో ఆకస్మిక తనిఖీ చేసిన వరంగల్ కలెక్టర్

ఎంజీఎం ప్రభుత్వ ఆసుపత్రిని కలెక్టర్ సత్య శారదా ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జనరల్ మెడిసిన్, క్యాజువాలిటీతో పాటు ఇతర విభాగాల్లో అందుతున్న వైద్య సేవల వివరాలను రోగులను అడిగి తెలుసుకున్నారు. రోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై వైద్య సిబ్బందితో చర్చించారు. రోగులకు మెరుగైన సేవలు అందేలా తక్షణ చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు.