News July 18, 2024
సింహాచలం గిరి ప్రదక్షిణకు అనువంశిక ధర్మకర్తకు ఆహ్వానం

ఈ నెల 20వ తేదీన ప్రారంభం కానున్న సింహగిరి ప్రదక్షిణ ఉత్సవానికి హాజరు కావాలని ఆలయ అనువంశిక ధర్మకర్త, మాజీ మంత్రి అశోక గజపతి రాజును దేవస్థానం ఈవో శ్రీనివాసమూర్తి ఆహ్వానించారు. ఈ మేరకు విజయనగరంలోని అశోక్ బంగ్లాలో ఆయనను కలిసి ఉత్సవ ఏర్పాట్లను వివరించారు. అలాగే ఆషాఢ పౌర్ణమి సందర్భంగా 21న ఆలయంలో జరిగే చందన సమర్పణ వైదిక కార్యక్రమాలను తెలియజేశారు.
Similar News
News July 6, 2025
గిరి ప్రదక్షిణ ట్రాఫిక్ రూల్స్- 2

➦ అనకాపల్లి నుంచి సిటీ వైపు వచ్చే భారీ వాహనాలు లంకెలపాలెం జంక్షన్ నుంచి సబ్బవరం మీదుగా ప్రయాణం చేయాలి.
➦09 తేదీ ఉదయం 6 నుంచి అడవివరం, గోపాలపట్నం పెట్రోల్ బంక్ మధ్య వాహనాలకు నో ఎంట్రీ. దువ్వపాలెం, అక్కిరెడ్డిపాలెం, వేపగుంట జంక్షన్ మీదుగా ప్రయాణించాలి
➦అనకాపల్లి నుంచి శ్రీకాకుళం, విజయనగరం వైపు వెళ్ళు వాహనాలు విశాఖ సిటీలోకి అనుమతి లేదు. లంకెలపాలెం, సబ్బవరం, పెందుర్తి, ఆనందపురం మీదుగా వెళ్ళాలి.
News July 6, 2025
గిరి ప్రదక్షిణకు ట్రాఫిక్ రూల్స్-3

➥ శ్రీకాకుళం, విజయనగరం వైపు నుంచి అనకాపల్లి వైపు వచ్చే ప్రైవేటు ట్రావెల్ బస్సులు, RTC బస్సులు, ఇతర వాహనదారులు ఆనందపురం, పెందుర్తి, సబ్బవరం మీదుగా అనకాపల్లి చేరుకోవాలి.
➥ గిరిప్రదక్షిణకు వచ్చు భక్తుల రద్దీ దృష్ట్యా విశాలాక్షి నగర్ బీచ్ రోడ్ జంక్షన్ నుంచి కురుపాం బీచ్ రోడ్ జంక్షన్ వరకు వాహనములు అనుమతించరు.
➥హనుమంతువాక జంక్షన్, వెంకోజీపాలెం జంక్షన్ వద్ద భక్తుల రద్దీ ఉంటుంది.
News July 6, 2025
గిరి ప్రదక్షిణ ట్రాఫిక్ రూల్స్- 4

➣జోడుగుల్లపాలెం జంక్షన్ నుంచి హనుమంతవాక జంక్షన్ వైపునకు, హనుమంతవాక జంక్షన్ నుంచి జోడుగుల్లపాలెం జంక్షన్ వైపునకు వాహనములు అనుమతించరు. ఆ ప్రాంతీయులు విశాలాక్షినగర్ మెయిన్ రోడ్డు గుండా ప్రయాణించి SBI జంక్షన్ వద్ద జాతీయ రహదారి చేరుకోవాలి.
➣సీతమ్మధార, అల్లూరి సీతారామరాజు స్టాట్యూ నుంచి వెంకోజిపాలెం జంక్షన్ వైపు వాహనాలు అనుమతించరు.
➣వెంకోజిపాలెం జంక్షన్ నుంచి అపుఘర్ జంక్షన్ వైపు వాహనాలకు నో ఎంట్రీ.