News July 18, 2024
అసిస్టెంట్ కమిషనర్ అవినీతిపై కమిటీ వేస్తున్నాం: మంత్రి ఆనం
దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి కుమారిపై వచ్చిన ఆరోపణలపై కమిటీ వేస్తున్నామని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పేర్కొన్నారు. గురువారం నెల్లూరులో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గతంలో అసిస్టెంట్ కమిషనర్ శాంతి కుమారి ఎంపీ విజయసాయి రెడ్డికి అనుకూలంగా పోస్టులు పెట్టారని అన్నారు.
Similar News
News January 18, 2025
నెల్లూరు: ఫ్లెమింగో ఫెస్టివల్.. ఇవి మిస్ కాకండి
నేటి నుంచి ఫ్లెమింగో ఫెస్టివల్ ప్రారంభమవుతున్న సంగతి తెలిసిందే. ఈ ఫెస్టివల్‌లో అసలు మిస్ అవ్వకూడని ప్రదేశాలు ఏంటో ఓ లుక్ వేద్దాం.
☛సూళ్లూరుపేట చెంగాళమ్మ గుడి
☛ మన్నారుపోలూరు కృష్ణ స్వామి గుడి
☛ శ్రీహరికోట రాకెట్ కేంద్రం
☛ నర్సమాంబపురంలో ఎర్రకాళ్ల కొంగలు
☛ పులికాట్ ఫ్లెమింగోలు
☛భీములవారిపాళెం-ఇరకందీవి పడవ ప్రయాణం
News January 18, 2025
నెల్లూరు: ఇరిగేషన్‌లో రెగ్యులర్ ఎస్ఈల నియామకం
చాలా కాలంగా ఇన్‌ఛార్జ్‌ల పాలన కొనసాగుతున్న నెల్లూరు జిల్లాలోని ఇరిగేషన్ సర్కిళ్లకు రెగ్యులర్ ఎస్ఈలు నియమితులయ్యారు. నెల్లూరు సర్కిల్ ఎస్ఈగా దేశా నాయక్, సోమశిల ప్రాజెక్టు ఎస్ఈగా రమణారెడ్డి, నెల్లూరు తెలుగు గంగ ప్రాజెక్టు ఎస్ఈగా రాధాకృష్ణారెడ్డిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. ఇప్పటి వరకు దేశా నాయక్, రమణారెడ్డి అదే పోస్టుల్లో ఇన్‌ఛార్జ్‌లుగా ఉన్నారు.
News January 18, 2025
నెల్లూరు: 17 రోజుల్లో పది మంది మృతి
నెల్లూరు జిల్లాలో గడచిన 17 రోజుల్లో వివిధ కారణాలతో పదిమంది ఆత్మహత్య చేసుకున్నారు. కొంతమంది ప్రేమ విఫలమై, కొంతమంది బెట్టింగ్లకు పాల్పడి, కొంతమంది వ్యక్తిగత సమస్యలతో బలవన్మరణానికి పాల్పడ్డారు. కాగా చిన్న చిన్న సమస్యలకే తనువు చాలించడం సరైంది కాదని మానసిక నిపుణులు పేర్కొంటున్నారు. మానసిక దృఢత్వం అవసరమని వారు అభిప్రాయపడుతున్నారు.