News July 18, 2024
కోహ్లీ అభిమానులకు GOOD NEWS!
శ్రీలంకతో వన్డే సిరీస్‌కు ముందు విరాట్ కోహ్లీ అభిమానులకు శుభవార్త. అతడు వన్డేలకు అందుబాటులో ఉంటారని ‘EXPRESS SPORTS’ తెలిపింది. దీంతో రోహిత్, విరాట్ కలిసి ఆడటాన్ని అభిమానులు ఎంజాయ్ చేయొచ్చు. ఇక టీ20లకు సూర్య సారథ్యం వహిస్తారని, బుమ్రాకు విశ్రాంతి ఇస్తారని పేర్కొంది. పంత్, రియాన్ పరాగ్‌లను టీ20లతో పాటు వన్డేల్లోనూ తీసుకుంటారని వివరించింది.
Similar News
News December 27, 2024
భూముల విలువ పెంపు నిర్ణయం వాయిదా
AP: రాష్ట్రంలో భూముల మార్కెట్ విలువలను జనవరి 1 నుంచి 10-20శాతం పెంచాలన్న నిర్ణయంపై కూటమి ప్రభుత్వం పునరాలోచనలో పడింది. దీనిపై ప్రజల్లో వ్యతిరేకత వస్తుండటంతో అమలును వాయిదా వేసింది. ఈ అంశంపై మరోసారి సమగ్రంగా చర్చించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటామని మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. ఈ నెల 30న మంగళగిరిలో సీసీఎల్ఏ కార్యాలయంలో జోనల్ రెవెన్యూ సమావేశం నిర్వహిస్తామని చెప్పారు.
News December 27, 2024
డైరెక్టర్ కన్నుమూత
తమిళ దర్శకుడు సభాపతి దక్షిణామూర్తి అలియాజ్ SD సభా(61) అనారోగ్యంతో కన్నుమూశారు. ఈయన తమిళంలో విజయ్‌కాంత్ హీరోగా భారతన్ మూవీతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. తర్వాత ప్రభుదేవాతో వీఐపీ అనే సినిమాను తెరకెక్కించారు. తెలుగులో 2005లో జగపతిబాబు, కళ్యాణి జంటగా పందెం అనే చిత్రానికి దర్శకత్వం వహించారు. సభా తమిళంలో తీసిన సుందర పురుషుడు అనే సినిమా ‘అందాల రాముడు’గా రీమేక్ చేశారు. మొత్తంగా 10 మూవీలకు పనిచేశారు.
News December 27, 2024
నల్ల బ్యాండ్లతో భారత క్రికెటర్లు
బాక్సింగ్ డే టెస్టులో రెండో రోజు భారత క్రికెటర్లు చేతికి నల్ల బ్యాండ్లతో కనిపించారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణానికి సంతాపంగా వీటిని ధరించారు. రెండో రోజు ఆటలో కమిన్స్(49) వికెట్‌ను జడేజా తీశారు. మరోవైపు సెంచరీ తర్వాత స్మిత్ దూకుడు పెంచారు. AUS స్కోరు 446/7.