News July 18, 2024
నష్టాల నుంచి కోలుకుని భారీ లాభాల్లో ముగిశాయి!

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు ట్రేడింగ్‌ను లాభాలతో ముగించాయి. సెన్సెక్స్ 81,343 (+626) వద్ద స్థిరపడింది. మరోవైపు ఆల్ టైమ్ హై (24,837) తాకిన నిఫ్టీ 187 పాయింట్ల లాభంతో 24,800 వద్ద ముగిసింది. LTIM 3.48%, ONGC 2.99% సహా TCS, విప్రో 2 శాతానికిపైగా లాభాలను నమోదు చేయడం మార్కెట్లకు కలిసొచ్చింది. ఓ దశలో నష్టాలను నమోదు చేసిన మార్కెట్లు లాభాలతో క్లోజవడంపై ఇన్వెస్టర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Similar News
News December 28, 2025
సిల్వర్ షాక్.. నెలలో ₹82,000 జంప్

సరిగ్గా నెల క్రితం KG వెండి ధర ₹1,92,000. ఇప్పుడది ₹2,74,000కు చేరింది. కేవలం నెలరోజుల్లోనే ₹82,000 పెరిగింది. ‘పేదవాడి బంగారం’గా పిలిచే వెండి ఇప్పుడు తానూ బంగారం బాటలోనే నడుస్తానంటోంది.. దీంతో కొనలేక సామాన్యులు.. అమ్మకాలు లేక వ్యాపారులు తలలు పట్టుకుంటున్నారు. పెళ్లిళ్ల సీజన్ రానుండటంతో మధ్యతరగతి కుటుంబాల బడ్జెట్ తలకిందులు కావడం పక్కాగా కనిపిస్తోంది!
News December 28, 2025
DRDOలో JRF పోస్టులు

DRDO పరిధిలోని హై ఎనర్జీ మెటీరియల్స్ రీసెర్చ్ ల్యాబోరేటరీ(<
News December 28, 2025
‘అర్బన్ నక్సల్స్’పై NIA ఫోకస్.. రాబోయే రోజుల్లో అరెస్టులు!

యువతలో మావోయిస్టు భావజాలాన్ని నూరిపోస్తున్న ఫ్రంటల్ ఆర్గనైజేషన్లపై NIA ఫోకస్ పెట్టింది. అడవుల్లో మావోయిస్టులను కట్టడి చేయడంలో సక్సెస్ అవుతున్నా కొందరు మేధావుల ముసుగులో యువతను రెచ్చగొడుతున్నారని సీరియస్‌గా ఉంది. సోషల్ మీడియాలో ప్రచారం చేస్తూ మావోలను హీరోలుగా వర్ణిస్తూ అమాయకులను అడవిబాట పట్టిస్తున్నట్లు గుర్తించింది. రాబోయే రోజుల్లో అలాంటి వారిని అరెస్టు చేయడానికి ప్లాన్లు వేస్తోంది.


