News July 18, 2024
పిన్నెల్లి బెయిల్ పిటిషన్ కొట్టివేత

AP: పల్నాడు జిల్లా మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి బెయిల్ పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. ప్రస్తుతం నెల్లూరు సెంట్రల్ జైల్లో ఆయన రిమాండ్ ఖైదీగా ఉన్నారు. కాగా ఎన్నికల పోలింగ్ సమయంలో టీడీపీ ఏజెంట్, కారంపూడి సీఐపై దాడి ఘటనల్లో ఆయనకు మాచర్ల సివిల్ కోర్టు రిమాండ్ విధించింది.
Similar News
News January 9, 2026
మళ్లీ పెరిగిన బంగారం ధర!

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు గంటల వ్యవధిలోనే మళ్లీ పెరిగాయి. 24 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర ఇవాళ మొత్తం రూ.1,310 పెరిగి రూ.1,39,310కు చేరింది. అలాగే 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.1,200 ఎగబాకి రూ.1,27,700 పలుకుతోంది. అటు కేజీ వెండి ధర రూ.4వేలు తగ్గి రూ.2,68,000గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.
News January 9, 2026
మోదీ, ట్రంప్ 8 సార్లు మాట్లాడుకున్నారు: విదేశాంగ శాఖ

భారత్‌తో వాణిజ్య ఒప్పందం ఆలస్యం కావడానికి మోదీ <<18806375>>ఫోన్ చేయకపోవడమే<<>> కారణమని US వాణిజ్య కార్యదర్శి లుట్నిక్ చేసిన వ్యాఖ్యలను ఇండియా ఖండించింది. ‘వాణిజ్య ఒప్పందంపై గతేడాది ఫిబ్రవరి నుంచి 2 దేశాలు చర్చలు జరిపాయి. చాలాసార్లు మేం డీల్‌కు చేరువయ్యాం. చర్చలపై తాజాగా చేసిన వ్యాఖ్యల్లో నిజం లేదు. గతేడాది మోదీ, ట్రంప్ 8సార్లు ఫోన్లో మాట్లాడుకున్నారు’ అని విదేశాంగ శాఖ ప్రతినిధి రణ్‌ధీర్ జైస్వాల్ చెప్పారు.
News January 9, 2026
అస్సోం రైఫిల్స్ 95 పోస్టులకు నోటిఫికేషన్

<


