News July 18, 2024
ALERT: హైదరాబాద్‌లో కాసేపట్లో భారీ వర్షం!

TG: కాసేపట్లో హైదరాబాద్ నగరంలో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. నగర ఉత్తర భాగంలో మేఘాలు కమ్ముకున్నాయని.. మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. మిగతా ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందంది. రాత్రి 8 గంటలకు వర్షం మొదలై రెండు గంటల పాటు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు.
Similar News
News January 30, 2026
బోర్ కొడుతుందని ఖాళీ సమయంలో చదివి..!

రైలులో వెళ్లే సమయాన్ని చదివేందుకు కేటాయించి BARC శాస్త్రవేత్తగా ఎదిగిన వేలుమణి జీవితం ఎందరికో స్ఫూర్తిదాయకం. ఆయన కోయంబత్తూర్ రామకృష్ణ మిషన్ విద్యాలయంలో చదువుకోగా పేదరికంతో హాస్టల్‌లో ఉండలేక రోజూ రైలులో ప్రయాణించేవారు. ఈ జర్నీలో రోజుకు 6 గంటల ఖాళీ టైమ్ దొరికేది. ఈ సమయంలో గణితం, ఫిజిక్స్ చదువుకున్నానని వేలుమణి ట్వీట్ చేశారు. ఆయన స్థాపించిన థైరోకేర్ టెక్నాలజీస్ నెట్‌వర్త్ రూ.5వేల కోట్లు.
News January 30, 2026
120 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

<
News January 30, 2026
అవాంఛిత రోమాలకు ఇలా చెక్

మహిళలను ఎక్కువగా వేధించే సమస్య అవాంఛిత రోమాలు. వీటిని కొన్ని ఇంటి చిట్కాలతో తగ్గించుకోవచ్చు. పాలలో పసుపు వేసి కలిపి ఈ మిశ్రమాన్ని అవాంఛిత రోమాలు ఉన్న చోట రాసి 20 నిమిషాల తర్వాత వేడి నీటితో కడిగేసినట్లైతే రోమాలన్నీ తొలగిపోతాయి. ఒక అరటిపండు గుజ్జు, రెండు స్పూన్ల ఓట్ మీల్ కలిపి ముఖానికి పట్టించాలి, కాసేపు మర్దనా చేసుకోవాలి. స్నానం చేసేటప్పుడు ఫేస్‌కు పసుపు రాసి కడుక్కుంటే కూడా మంచి ఫలితం ఉంటుంది.


