News July 18, 2024
‘భిల్‌ప్రదేశ్’ రాష్ట్రం కావాలి: గిరిజనుల డిమాండ్

‘భిల్‌ప్రదేశ్’ పేరిట తమకు కొత్త రాష్ట్రాన్ని ఇవ్వాలని రాజస్థాన్‌లోని గిరిజనులు డిమాండ్ చేస్తున్నారు. రాజస్థాన్, మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్‌లోని 49 జిల్లాలను కలిపి కొత్త రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని వారు ఆందోళన చేస్తున్నారు. ఈమేరకు 35 గిరిజన సంఘాలు భారీ ర్యాలీ నిర్వహించాయి. ఇందులో భాగంగా గిరిజన మహిళలు బొట్టు, మంగళసూత్రాలు ధరించరాదని గిరిజన నేతల్లో పలువురు పిలుపునివ్వడం గమనార్హం.
Similar News
News January 8, 2026
సోదరికి గుడి కట్టి దేవతలా కొలుస్తున్నాడు!

AP: నెల్లూరు జిల్లా వెంకటాచలంలో అపురూపమైన సోదర బంధం వెల్లివిరిసింది. 14 ఏళ్ల క్రితం ప్రమాదంలో మరణించిన అటవీ శాఖాధికారి సుబ్బలక్ష్మి జ్ఞాపకార్థం ఆమె సోదరుడు ఏకంగా ఓ ఆలయాన్ని నిర్మించారు. ఆమెను దేవతగా కొలుస్తూ గత 14 ఏళ్లుగా నిత్య పూజలు, ఘనంగా ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. మరణం తన సోదరిని భౌతికంగా దూరం చేసినా గుడి కట్టి ఆరాధిస్తున్న ఆ సోదరుడిపై నెట్టింట ప్రశంసలొస్తున్నాయి.
News January 8, 2026
ఇండస్ట్రీయల్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

ఇండస్ట్రీయల్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (<
News January 8, 2026
వివాహ వ్యవస్థ గొప్పతనం

హిందూ సంస్కృతిలో వివాహం ముఖ్యమైన సంస్కారం! సమాజంలో గృహస్థాశ్రమానికి అత్యంత ప్రాధాన్యత ఉంది. వివాహం వ్యక్తిని బాధ్యతాయుత మార్గంలో నడిపిస్తుంది. వేదాలు వివాహాన్ని పవిత్రమైనదిగాను, లోక కళ్యాణానికి మార్గంగాను అభివర్ణించాయి. అందుకే దీనిని యజ్ఞంలా భావిస్తారు. మహర్షులు, పురాణకర్తలు తమ రచనల ద్వారా వివాహ వ్యవస్థ గొప్పదనాన్ని చాటిచెప్పి, మనిషిని ఉత్తమ పౌరుడిగా తీర్చిదిద్దే మార్గాన్ని సుగమం చేశారు. <<-se>>#Pendli<<>>


