News July 18, 2024

నన్నయ, JNTUK ఇన్‌ఛార్జి వీసీలు వీరే

image

రాజానగరంలోని ఆదికవి నన్నయ యూనివర్సిటీ ఇన్‌ఛార్జి వీసీ(వైస్ ఛాన్సలర్)గా ప్రొ.వై.శ్రీనివాసరావు నియమితులయ్యారు. ప్రస్తుతం జియో సైన్సెస్ విభాగంలో ‌ప్రొఫెసర్‌గా, ఫ్యాకల్టీ ఆఫ్ సైన్సెస్ డీన్‌గా ఉన్న శ్రీనివాసరావు.. ఇన్‌ఛార్జి వీసీగా బాధ్యతలు స్వీకరించారు. కాకినాడ JNTU ఇన్‌చార్జి వీసీగా అదే వర్సిటీలో సివిల్ ఇంజినీరింగ్ డిపార్ట్‌మెంట్‌లో విధులు నిర్వర్తిస్తున్న ఫ్రొ.KVSG మురళీకృష్ణ నియమితులయ్యారు.

Similar News

News October 24, 2025

రాజమండ్రిలో ఈ నెల 25న జాబ్ మేళా

image

ఈ నెల 25వ తేదీన రాజమండ్రిలోని జిల్లా కలెక్టరేట్ వద్ద ఉన్న వికాస కార్యాలయంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. ఈ జాబ్ మేళాలో టెన్త్, ఇంటర్, డిగ్రీ, ఐటీఐ, డిప్లొమా, బీటెక్ ఉత్తీర్ణులైన 35 ఏళ్ల లోపు అభ్యర్థులకు వివిధ కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు ఆమె వివరించారు. అర్హులైన యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

రాజమండ్రి: చింతాలమ్మ ఘాట్ వద్ద గుర్తుతెలియని వ్యక్తి మృతి

image

గోదావరి నది ఒడ్డున చింతాలమ్మ ఘాట్‌లో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. మృతుడు నల్లటి చారలు గల షర్ట్, నలుపు రంగు ప్యాంటు ధరించి ఉన్నాడు. ఇతని వయస్సు సుమారు 50-55 సంవత్సరాల మధ్య ఉండవచ్చు. మృతుడి వివరాలు తెలిసినవారు వెంటనే III టౌన్ L&O పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్‌ (సెల్: 9440796532) లేదా సబ్-ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్‌ (సెల్: 9490345517)కు తెలపాలని త్రీ టౌన్ సీఐ కోరారు.