News July 18, 2024

ADB: మద్యం మత్తులో మహిళ హంగామా

image

మద్యం మత్తులో ఒక మహిళ ఆర్టీసీ బస్సులో హంగామా సృష్టించింది. ఆదిలాబాద్ నుంచి ఆర్టీసీ బస్సు గురువారం నిర్మల్‌కు బయలుదేరింది. మద్యం మత్తులో ఉన్న ఒక మహిళ ఆ బస్సు ఎక్కి ఇబ్బందులకు గురిచేసింది. మహిళను బస్సు దిగమని కండక్టర్ సూచించినప్పటికీ దిగనని మొండికేసింది. దీంతో బస్సును కలెక్టర్ చౌక్ వద్ద నిలిపివేశారు. మహిళా పోలీసులు వచ్చి ఆమెను బలవంతంగా బస్సులోంచి కిందికి దింపేసి మద్యం సీసాను స్వాధీనం చేసుకున్నారు.

Similar News

News August 27, 2025

తాంసి : అధిక మద్యం తాగి మృతి

image

తాంసి మండలంలోని గొట్కూరిలో మద్యం మత్తు విషాదంగా మారింది. గ్రామస్థుల కథనం ప్రకారం.. మడావి లక్ష్మణ్(48) సోమవారం రాత్రి స్నేహితులతో అధిక మద్యం తాగాడు. ఇంటికి వచ్చిన ఆయన అపస్మారక స్థితిలో పడిపోగా కుటుంబీకులు రిమ్స్‌కు తరలించారు. అప్పటికే మృతిచెందడంతో ఇంటికి వచ్చారు. మంగళవారం కుటుంబీకులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రిమ్స్‌కు తరలించారు.

News August 27, 2025

600 మంది సిబ్బంది.. 400 సీసీ కెమెరాలు: ADB SP

image

గణపతి ఉత్సవాలకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. ప్రధాన పట్టణాలలో క్లస్టర్లు, సెక్టర్లు వారీగా విభజించి బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామన్నారు. 3 షిఫ్టుల్లో నిరంతరం గస్తీతో పర్యవేక్షిస్తూ సిబ్బంది విధులు నిర్వహిస్తారని పేర్కొన్నారు. 600 మంది సిబ్బంది, 400 సీసీ కెమెరాలతో నిఘా ఉంటుందన్నారు. ప్రతి గణపతి మండపానికి జియో ట్యాగింగ్ చేస్తున్నట్లు వివరించారు.

News August 26, 2025

ADB: దివ్యాంగులకు ఐదు శాతం రిజర్వేషన్ కల్పించాలి

image

రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల్లో దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా ఐదు శాతం రిజర్వేషన్ కల్పించాలని హ్యాండీక్యాప్డ్ హెల్పింగ్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడు మహమ్మద్ ఇమ్రాన్ కోరారు. ఇటీవల నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఆదిలాబాద్ జిల్లా మైనార్టీ శాఖ అధికారి కలీంను కలిసి వినతిపత్రం అందజేశారు. ప్రభుత్వ కార్యాలయాల వద్ద దివ్యాంగులకు అన్ని ఏర్పాట్లు చేపట్టాలన్నారు.