News July 18, 2024
రేపు వినుకొండకు జగన్.. షెడ్యూల్ విడుదల

AP: శుక్రవారం ఉ.10 గంటలకు మాజీ సీఎం జగన్ వినుకొండకు బయల్దేరనున్నారు. గుంటూరు, చిలకలూరిపేట, నరసరావుపేట బైపాస్ మీదుగా వినుకొండ చేరుకుంటారని వైసీపీ తెలిపింది. మ.ఒంటి గంటకు రషీద్ కుటుంబసభ్యులను పరామర్శిస్తారని పేర్కొంది. అనంతరం రోడ్డుమార్గంలోనే తాడేపల్లి నివాసానికి చేరుకుంటారని వివరించింది.
Similar News
News July 5, 2025
వీఆర్వో, వీఏవోలకు మరో అవకాశం: మంత్రి

TG: రెవెన్యూ వ్యవస్థ బలోపేతానికి ప్రతి రెవెన్యూ గ్రామానికి గ్రామ పరిపాలన అధికారి(GP0)ని నియమిస్తున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. VRO, వీఏవోలకు జీపీవోలుగా అవకాశం కల్పించడానికి మరోసారి పరీక్ష నిర్వహిస్తామని చెప్పారు. గతంలో నిర్వహించిన ప్రత్యేక పరీక్షలో 3,453 మంది అర్హత సాధించారని వెల్లడించారు. భూసమస్యల పరిష్కారానికి భూ భారతి చట్టం తీసుకొచ్చామని వివరించారు.
News July 5, 2025
డైట్ కోక్ అధికంగా తాగుతున్నారా?

చాలా మంది షుగర్ ఉండదనే నెపంతో డైట్ కోక్ తాగేందుకు ఇష్టపడుతుంటారు. అయితే, వీటిని అమితంగా సేవించడం ప్రమాదకరమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. డైట్ కోక్‌లను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మెటబాలిక్ సిండ్రోమ్ ప్రమాదం పెరుగుతుందని తెలిపారు. అలాగే అప్పుడప్పుడు వీటిని తాగితే హాని ఉండదని పేర్కొన్నారు. కానీ దీర్ఘకాలికంగా ఉపయోగిస్తే జీవక్రియ దెబ్బతినడంతో పాటు వివిధ అనారోగ్య సమస్యలు వస్తాయని చెబుతున్నారు.
News July 5, 2025
భారత్, బంగ్లాదేశ్ వైట్ బాల్ సిరీస్ వాయిదా

భారత్, బంగ్లాదేశ్ పురుషుల క్రికెట్ జట్ల మధ్య ఈ ఏడాది ఆగస్టులో జరగాల్సిన వైట్ బాల్ సిరీస్ వాయిదా పడింది. దీనిని వచ్చే ఏడాది సెప్టెంబర్‌లో నిర్వహించనున్నట్లు BCCI ప్రకటించింది. ఇరు దేశాల క్రికెట్ బోర్డులు దీనికి అంగీకారం తెలిపాయని పేర్కొంది. షెడ్యూల్ ప్రకారం IND, BAN మధ్య 3 వన్డేలు, 3 టీ20లు జరగాల్సి ఉంది. భద్రతా కారణాల దృష్ట్యా ఈ సిరీస్ రద్దయ్యే అవకాశం ఉందని ఇటీవల ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే.