News July 18, 2024

ముస్లిం మ్యారేజెస్ యాక్ట్ రద్దు చేయనున్న అస్సాం

image

ముస్లిం మ్యారేజెస్&డివోర్స్ రిజిస్ట్రేషన్ యాక్ట్‌1935 రద్దు చేయనున్నట్లు అస్సాం CM హిమంత శర్మ ప్రకటించారు. దానికి మంత్రివర్గం ఆమోదం తెలిపిందని వెల్లడించారు. రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో ఈ బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉంది. వివాహాలు, విడాకుల విషయంలో సమానత్వాన్ని తీసుకొచ్చేందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కాగా దీని స్థానంలో కొత్త చట్టాన్ని తీసుకొచ్చే యోచనలో ప్రభుత్వం ఉంది.

Similar News

News September 19, 2025

ఇది కదా అసలైన మార్పంటే.. హరీశ్ రావు సెటైర్

image

TG: తాము మేడిగడ్డ-మల్లన్నసాగర్ ప్రాజెక్టుకు ₹84వేల కోట్లు వెచ్చిస్తే కాంగ్రెస్ తమ్మిడిహట్టి-ఎల్లంపల్లికి ₹35వేల కోట్లు కేటాయించిందని హరీశ్‌రావు విమర్శించారు. ‘కాళేశ్వరంతో 37లక్షల ఎకరాలకు నీళ్లివ్వాలనేది లక్ష్యమైతే, ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుతో కేవలం 4.47లక్షల ఎకరాలకే సాగు నీరట! ₹35వేల కోట్లతో కేవలం 4.47లక్షల ఎకరాలకు నీరివ్వాలనే ఆలోచన అద్భుతం. ఇది కదా అసలైన మార్పంటే?’ అని హరీశ్ సెటైర్ వేశారు.

News September 19, 2025

బతుకమ్మ పండుగ.. ఆకాశం నుంచి పూల వర్షం!

image

TG: బతుకమ్మ పండుగను వైభవంగా నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈనెల 30న గ్రాండ్ ఫ్లోరల్ పరేడ్ ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. అమరవీరుల స్మారక చిహ్నం నుంచి బతుకమ్మ ఘాట్ వరకు 2500 మంది మహిళలు బతుకమ్మలతో ర్యాలీ చేపట్టనున్నారు. ఆ సమయంలో హెలికాప్టర్ నుంచి పూలను చల్లి వారికి స్వాగతం పలుకుతారు. 28న LB స్టేడియంలో 20వేల మందితో బతుకమ్మ ఆడించి గిన్నిస్ రికార్డు సాధించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

News September 19, 2025

అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడి బ్రహ్మోత్సవాల వివరాలు (1/2)

image

తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ఈనెల 24న ప్రారంభం కానున్నాయి. ఆరోజు ధ్వజారోహణం నుంచి వేడుకలు మొదలై, అక్టోబర్ రెండవ తేదీన ముగుస్తాయి. రోజువారి వివరాలివే..
Day 1(sep 24) : బంగారు తిరుచ్చి ఉత్సవం, పెద్దశేష వాహనం.
Day 2(sep 25) : చిన్న శేష వాహనం, హంస వాహనం
Day 3(sep 26) : సింహ వాహనం, ముత్యపు పందిరి వాహనం