News July 19, 2024
లింగ నిర్ధారణకు పాల్పడితే కఠిన చర్యలు: కలెక్టర్

సమాజంలో ఆడపిల్లల శాతాన్ని పెంచేందుకు ప్రతి ఒకరూ కృషి చేయాలని, లింగ వివక్షతను చూపే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ శివ శంకర్ లోతేటి పేర్కొన్నారు. గర్భస్థ శిశు నిర్ధారణ పరీక్షల నిర్మూలనపై కడప కలెక్టర్ కార్యాలయంలో సమావేశం జరిగింది. బాలల లింగ నిష్పత్తిని గమనిస్తే.. బాలురతో పోలిస్తే బాలికల శాతం చాలా తక్కువగా ఉందన్నారు. ఈ అసమానతలను తొలగించి సమాజంలో ఆడపిల్లల శాతాన్ని పెంచాలన్నారు.
Similar News
News January 16, 2026
ప్రొద్దుటూరులో అవినీతిపై చర్యలు ఏవీ..?

ప్రొద్దుటూరు ప్రభుత్వ శాఖల్లోని అవినీతిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. మున్సిపాలిటీ పెట్రోల్ బంకులో రూ.కోట్లల్లో స్కాం జరిగినట్లు ఆడిట్ గుర్తించినా రికవరీ లేదు. అగస్త్యేశ్వరాలయంలో బంగారు, వెండి, నగదు ఇంటి దొంగలు కొట్టేసినా చర్యలులేవు. పేజ్-3లో కాంట్రాక్టర్లు బిల్లులు తీసుకుని ఇళ్ల నిర్మాణాలు చేయకపోయినా చర్యలు లేవు. హౌస్ బిల్డింగ్ సొసైటీలో అక్రమాలపై MLA ఫిర్యాదు చేసినా రికవరీ లేదు.
News January 15, 2026
కడప బస్టాండ్‌లో తప్పిన ప్రమాదం

కడపలో ఓ వ్యక్తి చేసిన తప్పిదంతో ప్రజలు హడలిపోయారు. పులివెందుల బస్సుకు తాళం అలాగే వదిలేసి డ్రైవర్ వెళ్లిపోయాడు. ఈక్రమంలో ఓ యువకుడు బస్సు స్టార్ట్ చేశాడు. అప్పటికే అందులో ఉన్న ప్రయాణికులు అతడి తీరు చూసి భయంతో కేకలు వేశారు. ఆర్టీసీ సిబ్బంది, పోలీసులు వచ్చి యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. ఆ యువకుడి మతిస్థిమితం సరిగా లేదని సమాచారం. పొరపాటున అతను డ్రైవ్ చేసి ఉంటే ప్రమాదం జరిగి ఉండేది.
News January 15, 2026
కడప: వైట్ అండ్ వైట్‌లో మెరిసిన పోలీసులు

నిరంతరం విధి నిర్వహణలో భాగంగా డ్రెస్‌లో కనిపించే పోలీస్ అధికారులు భోగి పండుగ సందర్భంగా సాంప్రదాయ దుస్తులలో కనువిందు చేశారు. జిల్లా ఎస్పీ నచికేత్ ఆధ్వర్యంలో బుధవారం సంక్రాంతి సంబరాలను నిర్వహించారు. ఇందులో భాగంగా భోగి మంటలు వేసి భోగి పండుగను స్వాగతించారు. జిల్లా ఎస్పీతో సహా పలువురు పోలీస్ అధికారులు, సిబ్బంది సాంప్రదాయ దుస్తులు ధరించి ప్రత్యేకంగా కనిపించారు.


