News July 19, 2024

ALERT: ఈగలే కదా అని లైట్ తీసుకోవద్దు!

image

వర్షాకాలంలో ఇంట్లోకి ఈగలు వస్తుంటాయి. వాటి శరీరం వ్యాధులను కలిగించే క్రిములకు నిలయమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈగలు వాలిన ఆహారం తింటే టైఫాయిడ్, కలరా వంటి వ్యాధులు వచ్చే ప్రమాదముందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈగ వేసే ప్రతి అడుగు బ్యాక్టీరియాను మనుషుల్లోకి బదిలీ చేయగలదని పరిశోధనల్లో తేలింది. ఈగలు రాకుండా పరిశుభ్రత పాటించడంతో పాటు ఇతర జాగ్రత్తలు తీసుకోవడం ఉత్తమం.
> SHATE

Similar News

News January 14, 2025

పవన్ కొన్న ఈ బుక్ గురించి తెలుసా?

image

ఇటీవల Dy.CM పవన్ ‘మ్యాన్స్ సెర్చ్ ఫర్ మీనింగ్’ అనే పుస్తకాన్ని ఎక్కువ సంఖ్యలో కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో SMలో దీని గురించి పలువురు తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. ఈ బుక్‌ రచయిత విక్టరీ ఫ్రాంక్ అనే మానసిక వైద్యుడు. ‘మనిషి నిస్సహాయ స్థితిలో ఉండి అర్థం లేని బాధని, అణచివేతని భరిస్తున్నపుడు దానిని తట్టుకొని ఎలా ముందుకు వెళ్లాలి’ అని స్వీయ అనుభవాన్ని ఇందులో రాసినట్లుగా చెబుతున్నారు.

News January 14, 2025

జనవరి 14: చరిత్రలో ఈరోజు

image

1896: భారత ఆర్థికవేత్త సి.డి.దేశ్‌ముఖ్ జననం
1937: సినీ నటుడు రావు గోపాలరావు జననం
1937: సినీ నటుడు శోభన్ బాబు జననం
1951: సినీ దర్శకుడు జంధ్యాల జననం
1979: కవి కేసనపల్లి లక్ష్మణకవి మరణం
1980: సినీ నటుడు ముదిగొండ లింగమూర్తి మరణం

News January 14, 2025

స్టేషన్ బెయిల్‌పై కౌశిక్‌ను విడిచిపెట్టాలి: హరీశ్

image

TG: ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని అరెస్టు చేయడం సరికాదని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. ఈ విషయమై డీజీపీ జితేందర్‌కి ఆయన ఫోన్ చేసి మాట్లాడారు. స్టేషన్ బెయిల్‌పై కౌశిక్‌ను విడిచిపెట్టాలని కోరారు. మరోవైపు పోలీసులు ఎమ్మెల్యేను అనూహ్యంగా త్రీటౌన్ స్టేషన్ కు తరలించారు. జడ్జి ముందుకు ప్రవేశపెట్టే విషయంలో మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉండటంతో ఆయనకు స్టేషన్‌లో బస ఏర్పాట్లు చేసినట్లు సమాచారం.