News July 19, 2024
ప్రజలకు మెరుగైన పోలీసింగ్ అందించాలి: కడప ఎస్పీ

పోలీసు వృత్తిపట్ల నిబద్దత, అంకితభావంతో విధులు నిర్వహిస్తూ ప్రజల మన్ననలు పొందాలని ఎస్పీ హర్షవర్ధన్ రాజు పోలీస్ అధికారులకు సూచించారు. కడప పోలీస్ కాన్ఫరెన్స్ హాలులో జిల్లా ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన అనంతరం తొలి నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రభావవంతంగా విధులు నిర్వర్తించే ‘విజిబుల్ పోలీసింగ్’ పై ప్రత్యేక శ్రద్ద వహించాలని ఆదేశించారు. ఫిర్యాదులను ప్రాధాన్యతతో నిర్ణీత సమయంలో పరిష్కరించాలన్నారు.
Similar News
News March 7, 2026
కడప: ‘10th పరీక్షలు పగడ్బందీగా నిర్వహించాలి’

కడప జిల్లాలో 10th పరీక్షలను నిష్పక్షపాతంగా, పారదర్శకంగా నిర్వహించాలని జేసీ నిధిమీనా పరీక్షల నిర్వాహక అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ సభా భవన్‌లో పది పబ్లిక్ పరీక్షల నిర్వహణపై సంబంధిత అధికారులకు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. మార్చి 16 నుంచి ఏప్రిల్ 1 వరకు 169 సెంటర్లలో 28,158 మంది విద్యార్థులకు పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆర్జేడీ శామ్యూల్, ఏసీ , డీఈఓ శంషుద్దీన్ హాజరయ్యారు.
News March 7, 2026
కమలాపురం వద్ద టిప్పర్- బైక్ ఢీ.. ఒకరు మృతి

కడప-తాడిపత్రి జాతీయ రహదారిపై శనివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కమలాపురం మండలం రామచంద్రపురం పరిధిలో టిప్పర్ స్కూటర్‌ను ఢీకొనడంతో ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. మృతి చెందిన వ్యక్తి జంగంపల్లికి చెందిన చంద్రశేఖర్‌రెడ్డిగా స్థానికులు గుర్తించారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పరిశీలించారు. ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News March 7, 2026
కడప: ఓపెన్ ఇంటర్ పరీక్షలకు 5,411 మంది విద్యార్థులు హాజరు.!

కడప జిల్లాలో శనివారం 34 కేంద్రాల్లో ఓపెన్ ఇంటర్ పరీక్షలు జరిగాయి. నేడు జరిగిన కెమిస్ట్రీ, ఎకనామిక్స్ పరీక్షలకు 5,411 మంది విద్యార్థులు హాజరయ్యారు. కెమిస్ట్రీ పరీక్షలు 3,764 మంది విద్యార్థులు రాయాల్సి ఉండగా.. 3,383 మంది రాశారు. 381 మంది ఆబ్సెంట్ అయ్యారు. ఎకనామిక్స్ పరీక్షలు 2,257 మంది విద్యార్థులు రాయాల్సి ఉండగా.. 2,028 మంది హాజరయ్యారు. అయితే 229 మంది గైర్హాజరయ్యారు.


