News July 19, 2024

రేపు ఢిల్లీకి సీఎం రేవంత్!

image

తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి రేపు ఢిల్లీ వెళ్లనున్నట్లు సమాచారం. కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీతో ఆయన భేటీ కానున్నారట. గత ఏడాది వరంగల్‌లో రైతు డిక్లరేషన్ సభలో ఇచ్చిన హామీ మేరకు రుణమాఫీ పథకం అమలు చేసిన విషయాన్ని వారికి తెలియజేస్తారని తెలుస్తోంది. దీనిపై వరంగల్‌లో నిర్వహించనున్న కృతజ్ఞతా సభకు రాహుల్ గాంధీని ఆహ్వానించనున్నట్లు సమాచారం.

Similar News

News January 23, 2025

బుమ్రా, భువనేశ్వర్‌ను దాటేసిన హార్దిక్ పాండ్య

image

T20ల్లో భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన జాబితాలో భువనేశ్వర్, బుమ్రాను హార్దిక్ పాండ్య దాటేశారు. ఇంగ్లండ్‌తో నిన్న జరిగిన తొలి T20లో 2 వికెట్లు తీసిన హార్దిక్ తన ఖాతాలో 91 వికెట్లు వేసుకున్నారు. ఈ జాబితాలో భువనేశ్వర్‌కు 90, బుమ్రాకు 89 వికెట్లు ఉన్నాయి. అటు ఇండియా తరఫున T20ల్లో అత్యధిక వికెట్లు తీసిన లిస్టులో చాహల్‌ను వెనక్కి నెట్టి అర్ష్‌దీప్ సింగ్ 97 వికెట్లతో అగ్రస్థానానికి చేరుకున్నారు.

News January 23, 2025

100 కోట్ల ఓటర్ల దిశగా భారత్

image

భారత్‌లో ఓటర్ల సంఖ్య 99.1కోట్లకు చేరిందని కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. గతేడాది లోక్‌సభ ఎన్నికల సమయంలో ఆ సంఖ్య 96.88కోట్లుగా ఉండేది. ఓటర్లలో యువతే ఎక్కువగా ఉన్నట్లు వెల్లడించింది. 18-29ఏళ్ల వయస్సున్న వారు ఏకంగా 21.7కోట్ల మంది ఉన్నట్లు తెలిపింది. భారత్ త్వరలోనే 100కోట్ల మంది ఓటర్లతో రికార్డ్ సృష్టించనుందని ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ ఇటీవల పేర్కొన్న విషయం తెలిసిందే.

News January 23, 2025

పురుషులే ఎత్తు, బరువు పెరుగుతున్నారు!

image

శతాబ్ద కాలంలో మహిళల కంటే పురుషులే 2రెట్లు వేగంగా ఎత్తు, బరువు పెరిగారని ఓ అధ్యయనం వెల్లడించింది. రోహాంప్టన్‌ వర్సిటీకి చెందిన ప్రొ.లూయిస్‌ హాల్సే నేతృత్వంలోని పరిశోధకుల బృందం WHOతో పాటు పలు దేశాల రికార్డుల నుంచి సమాచారం సేకరించింది. దీని ప్రకారం 2 జెండర్లలో ఎత్తు, బరువులో చోటు చేసుకున్న మార్పులను గమనించింది. ఆపై మానవ అభివృద్ధి సూచీ (హెచ్‌డీఐ) జీవన ప్రమాణాలతో పోల్చిచూసినట్లు హాల్సే చెప్పారు.