News July 19, 2024
ఈనెల 23 నుంచి TG అసెంబ్లీ సమావేశాలు
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఈనెల 23న, శాసనమండలి సమావేశాలు ఈనెల 24న ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు గవర్నర్ రాధాకృష్ణన్ నోటిఫికేషన్ జారీ చేశారు. ఈనెల 23న కేంద్రం పార్లమెంటులో పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో దానికి తగ్గట్లుగా ఈనెల 25న రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. 6 గ్యారంటీల అమలు, జాబ్ క్యాలెండర్, రుణమాఫీ తదితర అంశాలపై ఈ సమావేశాల్లో చర్చించే అవకాశం ఉంది.
Similar News
News January 14, 2025
నేడు పసుపు బోర్డు ప్రారంభం
TG: కేంద్రం ఇచ్చిన మాట ప్రకారం నిజామాబాద్‌లో పసుపు బోర్డు ఏర్పాటుకు ఉత్తర్వులు జారీ చేసింది. సంక్రాంతి పర్వదినాన పసుపు బోర్డును ఇవాళ కేంద్ర మంత్రి పీయూశ్ గోయల్ వర్చువల్‌గా ప్రారంభించనున్నారు. ఇప్పటికే జాతీయ బోర్డు ఛైర్మన్‌గా పల్లె గంగారెడ్డిని నియమిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. దాదాపు 15 ఏళ్లుగా బోర్డు ఏర్పాటుకు రైతులు డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే.
News January 14, 2025
రాహుల్ గాంధీ పోరాటం అందుకే: కేజ్రీవాల్
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఢిల్లీకి వచ్చి తనను చాలా సార్లు తిట్టారని ఆప్ చీఫ్ కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. అయితే ఆయన వ్యాఖ్యలపై తానెప్పుడూ ఎలాంటి కామెంట్లు చేయలేదని తెలిపారు. రాహుల్ కాంగ్రెస్‌ను రక్షించడానికి పోరాడితే తాను మాత్రం దేశం కోసం ఫైట్ చేస్తానని చెప్పారు. మరోవైపు ఢిల్లీని పారిస్‌గా మారుస్తానని చెప్పిన కేజ్రీవాల్ కాలుష్యంతో ఎవరూ నగరంలో తిరగకుండా చేశారని రాహుల్ సెటైర్లు వేశారు.
News January 14, 2025
ఉత్తరాయణంలోకి సూర్యుడు
సంక్రాంతి రోజైన ఇవాళ సూర్యుడు ధనస్సు రాశిని వీడి మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. ఇవాళ మకర సంక్రమణ ప్రారంభమవుతుంది. దీంతో దక్షిణాయణం పూర్తయి ఉత్తరాయణ పుణ్యకాలం మొదలవుతుంది. కాగా ఈ పండుగ అన్నింటిలోకెల్లా విశిష్ఠమైనదని పండితులు చెబుతారు. ఇవాళ సూర్యుడిని ఆరాధిస్తే మంచి జరుగుతుందని నమ్మకం. ఉత్తరాయణంలో చలి తీవ్రత తగ్గుముఖం పడుతుంది.