News July 19, 2024

HYDలో ఏఐ సిటీ ఏర్పాటు: మంత్రి శ్రీధర్ బాబు

image

TG: హైదరాబాద్‌లో 200 ఎకరాల విస్తీర్ణంలో కృత్రిమ మేధ(AI) సిటీని ఏర్పాటు చేయనున్నట్లు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. వచ్చే 20 ఏళ్లలో ప్రభుత్వ పాలన, పారిశ్రామిక రంగంలో ఏఐను వినియోగించే దిశగా ప్రణాళికల్ని రూపొందించనున్నట్లు వెల్లడించారు. బ్రిటిష్ హైకమిషన్, ఇ అండ్ వై ప్రతినిధులతో సమావేశంలో ఈ అంశంపై ఆయన చర్చించారు. ఏఐ సిటీలో కీలకంగా వ్యవహరించాలని ఈ సందర్భంగా మంత్రి వారిని కోరారు.

Similar News

News November 10, 2025

ప్రభుత్వ డ్రైవింగ్ శిక్షణ కేంద్రాలు.. నేరుగా లైసెన్స్!

image

AP: రాష్ట్రానికి 53 డ్రైవింగ్ శిక్షణ కేంద్రాలు(DTC), 5 ప్రాంతీయ ట్రైనింగ్ సెంటర్ల(RDTC)ను కేంద్ర రవాణా, జాతీయ రహదారుల శాఖ మంజూరు చేసింది. 10 లక్షల జనాభాకు ఒకటి చొప్పున DTCలను పెట్టనుండగా RDTCలను ఉత్తరాంధ్ర, రాయలసీమలో ఒకటి చొప్పున, కోస్తాలో 3 ఏర్పాటు చేయనుంది. వీటిలో టూవీలర్, కార్లు, భారీ వాహనాల ట్రైనింగ్ పూర్తి చేసుకుంటే రవాణా శాఖ కార్యాలయంలో టెస్ట్‌ లేకుండా నేరుగా లైసెన్స్ పొందవచ్చు.

News November 10, 2025

అందెశ్రీకి తీవ్ర అస్వస్థత

image

తెలంగాణ రాష్ట్ర గీతం ‘జయజయహే తెలంగాణ’ రచయిత అందెశ్రీ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. హైదరాబాద్‌లోని తన నివాసంలో ఆయన ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. కుటుంబ సభ్యులు వెంటనే గాంధీ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

News November 10, 2025

ప్రకృతి సేద్యం.. బ్రహ్మాస్త్రం తయారీకి కావాల్సిన పదార్థాలు

image

ప్రకృతి సేద్యంలో పెద్ద పురుగులు, చీడపీడల నివారణకు బ్రహ్మాస్త్రాన్ని రైతులు ఉపయోగిస్తున్నారు. బ్రహ్మాస్త్రం తయారీకి కావాల్సిన పదార్థాలు
☛ దేశవాళీ ఆవు లేదా నాటు ఆవు మూత్రం – 10 లీటర్లు
☛ వేప ఆకులు – 2 కిలోలు
☛ సీతాఫలం ఆకులు – 2 కిలోలు
☛ పల్లేరు(బిల్వపత్రం) ఆకులు – 2 కిలోలు
☛ ఉమ్మెత్త ఆకులు – 2 కిలోలు అవసరం.